![Shiv Sena MP Sanjay Raut Dancing With NCP MP Supriya Sule At His Daughters Sangeet Ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/29/shiva-sena.jpg.webp?itok=KGQ4OToH)
సాక్షి, ముంబై(మహారాష్ట్ర): ప్రతి ఒక్కరు తమ జీవితంలో వివాహ వేడుకను గొప్పగా జరుపుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా.. మెహందీ,సంగీత్ వంటి అనేక కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు హజరై డ్యాన్స్‌లు చేస్తుంటారు. పెళ్లివేడుకలలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా, పెళ్లి వేడుక డ్యాన్స్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుమార్తె పూర్వాన్షి వివాహం సోమవారం ముంబైలోని ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హజరయ్యారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే కూడా తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకకు హజరయ్యారు.
పెళ్లి వేడుకలో భాగంగా.. సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనిలో ఎంపీ సంజయ్‌రౌత్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయాతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేసి.. వివాహ వేడుకకు హజరైన అతిథులను ఉల్లాసపరిచారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా వీరితో పాటు కలిసి హుషారైన స్టెప్పులు వేశారు. ఎంపీ సుప్రీయా సులే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె .
పూర్వాన్షి రౌత్‌కు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మల్హార్ నర్వేకర్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఈయన తండ్రి రాజేష్ నర్వేకర్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment