Arjun's Daughter Aishwarya's Marriage With Umapathy Ramaiah Official Announce - Sakshi
Sakshi News home page

Arjun Sarja: కూతురి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌..

Published Tue, Jun 27 2023 1:28 PM | Last Updated on Tue, Jun 27 2023 1:44 PM

Arjun Daughter Aishwarya Marriage With Umapathy Ramaiah Official Announce - Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పెద్ద కూతురు నటి ఐశ్వర్య పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్త నిజమేనని వరుడి తండ్రి ప్రకటన చేశారు. దీంతో త్వరలో అర్జున్‌ ఇంట శుభకార్యం జరగనుంది. కొలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతితో వివాహం జరగనుంది. 

పెళ్లిపై తంబి రామయ్య ఏమన్నారంటే..

సోషల్‌మీడియాలో వస్తున్న వార్త నిజమే..  ఐశ్వర్య, ఉమాపతిల పెళ్లి త‍్వరలో జరగనుందని తంబి రామయ్య ప్రకటించారు. ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని మొదట తమ అబ్బాయి చెప్పాడంతో...  ఇరు కుటుంబాల పెద్దలు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అన్నారు.  నవంబర్‌ 8న ఉమాపతి పుట్టినరోజన పెళ్లి తేదీని ప్రకటిస్తామన్నారు.  వచ్చే ఏడాదిలో వీరిద్దరి పెళ్లి జరుపుతామని తంబి రామయ్య తెలిపారు.

ఉమాపతి- ఐశ్వర్య పరిచయం ఎక్కడంటే..
ఇద్దరు సినిమా రంగంలో ఉన్నా.. కలిసి నటించింది లేదు. మరి వీరిద్దరి మధ్య ఎక్కడ ప్రేమ చిగురించిందని పలువురు సోషల్‌ మీడియాలో వెతుకుతున్నారు. ఆర్జున్ హోస్ట్‌గా ZEE తమిళ్‌లో ఓ రియాలిటీ షో ‘సర్వైవర్’ చేశారు. అక్కడ షూటింగ్‌లో ఉమాపతి స్టార్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి మొదలైన వారి స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది.

(ఇదీ చదవండి: హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?)

ఆ తర్వాత అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో తంబి రామయ్య కుటుంబం పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరి లవ్‌స్టోరీ ఇరు కుటుంబాలకు తెలిసిందట. ఆపై కుటుంబ పెద్దలు కూడా ఆశీస్సులు అందించారని తెలుస్తోంది.  ఏదేమైనా వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది. అర్జున్, తంబి రామయ్య ఇద్దరూ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరున్నవారే కావడంతో వారి కుటుంబంలో జరిగే పెళ్లికి భారీగానే స్టార్స్‌ హాజరవుతారు.

(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement