
కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి!
ఆ తండ్రి తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. కొంత తనవద్దే ఉంచుకున్నాడు.
- రక్తం కారుతున్న బట్టలతోనే.. కోర్టు మెట్లెక్కిన వైనం
- కేసు నమోదు చేయాలని ఆదేశించిన జడ్జి
కాశిబుగ్గ (వరంగల్): ఆ తండ్రి తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. కొంత తనవద్దే ఉంచుకున్నాడు. అరుుతే ఆ ఆస్తిని కూడా తమకే ఇవ్వాలంటూ కొడుకులు వేధిస్తుండగా.. భరించలేక కోర్టు మెట్లెక్కాడు. వరంగల్ 11వ డివిజన్ లేబర్‌కాలనీలో నివాసం ఉం టున్న పోశాల రమేష్‌కు రాజేశ్, రాజేంద్ర ఇద్దరు కుమారులు. వీరికి రమేశ్ నాలుగు భవనాలు, ఇతర ప్లాట్లను సమానంగా పంచి ఇచ్చాడు. జీవన భృతి కోసం ఓ టెంట్‌హౌస్‌ను నడిపించుకుంటున్నాడు. అరుుతే ఆ టెంట్‌హౌస్‌ను కూడా తమకే ఇవ్వాలంటూ కుమారులు ఇబ్బంది పెడుతున్నారు. దీనికి రమేశ్ నిరాకరించడంతో మూడు రోజులుగా విపరీతంగా కొడుతున్నారు. దీంతో రమే్‌శ్ రెండు రోజుల క్రితం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పం దించలేదు.
పోలీస్‌స్టేషన్ కు ఎందుకు వెళ్లావంటూ సోమవారం మళ్లీ కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక రక్తం కారుతున్న బట్టలతోనే ఐదవ మున్సిఫ్ కోర్టును ఆశ్రరుుంచాడు. దీంతో స్పందించిన జడ్జి బాధితుడిని వైద్యపరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. తన ఆస్తి ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చానని, ఇద్దరూ ఫైనాన్ ్స వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని, అరుునా తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నారని రమేశ్ వాపోయాడు. కొడుకులు కొట్టిన దెబ్బలతో తనకు చెవులు వినిపించడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన జడ్జి దీనిపై కేసు నమోదు చేయూల్సిందిగా పోలీసులను ఆదేశించారు.