అదిలాబాద్: కన్న కొడుకులే తండ్రిని చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చంద భీమయ్య(74) మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో వాస్తవాలు బయటకు వచ్చాయి.
భీమయ్య కొడుకులు చిన్నయ్య, మల్లయ్య ఇద్దరు కలిసి అతన్ని నవారుతో ఉరివేసి హత్యచేశారని దర్యాప్తులో తేలడంతో బుధవారం వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.