
‘తల్లిదండ్రుల ఇంట్లో ఉండే హక్కు లేదు’
న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో ఉండవచ్చని, అలాగని కొడుకును అతడి జీవితాంతం భరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘తల్లిదండ్రుల కష్టార్జితంతో సంపాదించిన ఇల్లయితే... కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస లేదు.
అతడికి ఆ ఇంట్లో నివసించే హక్కులేదు’ అని పేర్కొంది. తల్లిదండ్రులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ జంట వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము కష్టపడి సంపాదించిన ఇళ్లలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కోడళ్లను ఖాళీ చేరుుంచాలని, వారు తమను హింసిస్తున్నారంటూ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రరుుంచారు.