
జైపూర్: కరోనా కారణంగా మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమయాత్రను ఆమె కొడుకులే నిర్వహించాల్సి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని నావల్‌పురా చౌక్‌కు చెందిన దినేష్ కుమార్ తల్లికి ఇటీవల కరోనా సోకడంతో అక్కడి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం ఆమె అస్పత్రిలో వద్దంటూ ఇంటికి తీసుకెళ్లమని తన ఇద్దరి కొడుకులను కోరింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లగా, అక్కడ ఆమె శనివారం మరణించింది.
తన తల్లి మృతదేహాన్ని శశ్మానవాటికి తీసుకెళ్లడానికి ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరగా వారు నిరాకరించారు. మృతురాలి ఇద్దరు కొడుకులు ఎంత వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు కరోనా మరణం అని తెలిసే సరికి అక్కడి గ్రామస్తులు కూడా ఆ కుటుంబానికి సహకరించలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకులిద్దరే ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. కరోనా నివారణ జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు గానీ కరోనాతో మరణించిన వారి విషయంలో మాత్రం దగ్గరకు రాకూడదనే నిబంధనలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
( చదవండి: 103 ఏళ్ల పెద్దాయన మనోధైర్యానికి తలవంచిన కోవిడ్ )
Comments
Please login to add a commentAdd a comment