కని.. పెంచి.. ప్రయోజకులను చేసిన కొడుకులు.. ముదిమి వయసులో కనీసం పలకరించడం లేదని మనస్తాపానికి గురైన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాజాపేట(నల్లగొండ): కని.. పెంచి.. ప్రయోజకులను చేసిన కొడుకులు.. ముదిమి వయసులో కనీసం పలకరించడం లేదని మనస్తాపానికి గురైన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివుడు(75) బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు ఉన్నా వారు సరిగ్గా చూసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శివుడు బలవంతంగా తనువు చాలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.