హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్, చంద్రపురి కాలనీలో ఓ మహిళ అమ్మతనాన్ని మరచి కన్న కొడుకులను కిరాతకంగా కడతేర్చింది. చిన్నారులిద్దరినీ నీటి సంపులో తోసేసి ప్రాణాలు తీసింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు... మంగళవారం సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత చంద్రపురి కాలనీలోని ఓ ఇంటి నీటి సంపులో ఇద్దరు చిన్నారుల మృత దేహాలు ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారులిద్దరినీ ఆరు నెలల అక్షర్, మూడేళ్ల సహస్రగా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు నిర్మల, మల్లేశ్. తల్లి నిర్మలకు మతిస్థితిమితం లేదని తెలుస్తోంది.