భారత దేశంలో పెళ్లి అనేది చాలా పెద్ద వేడుక. సామాన్య మధ్య తరగతి వారి నుంచి సంపన్నుల వరకూ వారి వారి స్థాయిలో వివాహ వేడుకను జరిపిస్తుంటారు. ఇక బడా వ్యాపారవేత్తల సంగతి చెప్పనక్కర లేదు. అత్యంత ఆడంబరంగా జరిగిన చాలా పెళ్లిళ్ల గురించి మనకు తెలుసు. అయితే ఆడంబరంతో పాటు ఆదర్శం కూడా ఉన్న ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్త కొడుకుల జంట వివాహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
(అమెజాన్ నుంచి 100 మంది అవుట్!)
సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతో రాయ్‌ల వివాహాలు 2004లో ఒకే వేదికలో జరిగాయి. రూ. 550 కోట్లతో అంగరంగ వైభవంగా వారి వివాహాలు జరిపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో నాలుగు రోజుల పాటు జరిగిన వివాహానికి అతిథులను ప్రైవేట్ జెట్‌లలో తరలించినట్లు వార్తలు వార్తలు వచ్చాయి. అయితే ఆ విలాసవంతమైన వివాహాలకు సంబంధించి ఆదర్శవంతమైన మరో కోణం ఉంది
కుమారుల వివాహం సందర్భంగా సుబ్రతా రాయ్ కుటుంబం వివిధ మతాలు, కులాలకు చెందిన 101 మంది నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చేసి సుమారు 15000 మంది పేదలకు భోజనం అందించారు. కాగా సుశాంతో, సీమాంతోల వివాహ వేడుకలకు దాదాపు 11,000 మంది అతిథులు హాజరయ్యారు.
(వామ్మో.. పసిడి పరుగు, వెండి హై జంప్!)
వివాహ వేడుకలో 100కి పైగా వివిధ రకాల వంటకాలను వడ్డించారు. సుశాంతో రాయ్ రిచా అహుజాను, సీమంతో రాయ్ చాందిని తూర్‌ను వివాహం చేసుకున్నారు. వివాహ వేదికను ఖరీదైన పూలు, పాలిష్ లైట్లు, ప్రిజం గ్లాసులు, దీపాలతో అద్భుతంగా అలంకరించారు. అతిథులలో పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment