కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో ఏడాది చదువుతున్న అజ్మీరా మంజుల(20) ఆత్మహత్య చేసుకుంది.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో ఏడాది చదువుతున్న అజ్మీరా మంజుల(20) ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రావోజీపేటకు చెందిన ఆమె శనివారం రాత్రి హాస్టల్‌లో తోటి విద్యార్థులతో కలిసి నిద్రించినా, ఆదివారం ఉదయం కనిపించలేదు. దీంతో వారు హాస్టల్‌లో వెతకగా.. ఖాళీగా ఉన్న మరో గదిలో ఫ్యాన్‌కు చున్నీ, నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించింది.
కాగా, మంజుల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థినులు, అధ్యాపకులు పేర్కొన్నారు. కానీ, మంజుల మృతిపై ఆమె తల్లిదండ్రులు లక్ష్మీబాయి, పంతులునాయక్ అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అంతటి అనారోగ్య సమస్యలేవీ ఆమెకు లేవన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.