
ప్రతీకాత్మక చిత్రం
ఉదయం నుంచి రమేష్ మృతదేహం వద్ద పూజలు...
జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్‌లో మృతదేహం దగ్గర పూజలు చేయడం కలకలం సృష్టించింది. అనారోగ్యంతో చనిపోయిన రమేష్ అనే వ్యక్తిని బతికిస్తానంటూ పుల్లయ్య అనే వ్యక్తి పూజలు చేయడం ప్రారంభించాడు. మంత్రాల కారణంగానే రమేష్ చనిపోయాడన్న పుల్లయ్య ఉదయం నుంచి రమేష్ మృతదేహం వద్ద పూజలు నిర్వహించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.