adoration
-
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు
జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్‌లో మృతదేహం దగ్గర పూజలు చేయడం కలకలం సృష్టించింది. అనారోగ్యంతో చనిపోయిన రమేష్ అనే వ్యక్తిని బతికిస్తానంటూ పుల్లయ్య అనే వ్యక్తి పూజలు చేయడం ప్రారంభించాడు. మంత్రాల కారణంగానే రమేష్ చనిపోయాడన్న పుల్లయ్య ఉదయం నుంచి రమేష్ మృతదేహం వద్ద పూజలు నిర్వహించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. -
మహిళలే టార్గెట్: తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ..
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పూజల పేరుతో మాయమాటలు చెప్పి ఓ ఇంట్లో బంగారు వస్తువులు కాజేపే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సంఘటన శుక్రవారం కొలిమిగుండ్ల లో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా దొంగల్లో ఒక రు ఊర్లో తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నారు. ఈ కోవలోనే పెద్దమ్మ ఆలయం సమీ పంలోని వీధిలో నివాసముండే శ్రావణితో చిత్తూరు లక్ష్మి అనే దొంగ ఇంట్లోకి వెళ్లి పూజలు చేస్తే నీభర్త ఆరోగ్యం బాగుపడుతుంది. అంతా శుభం జరుగు తుందని పూజల పేరుతో మరొక మహిళ ఇంట్లోకి చేరింది. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) వారి మాటలు నమ్మి పూజకు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బంగారు కూడా పెట్టాలని చెప్పడంతో నమ్మి అక్కడే ఉంచింది. ఆమె దృష్టి మరల్చి రోల్డ్‌గోల్డ్ వస్తువులను పెట్టి అసలు వస్తువులను బ్యాగులో వేసుకుంది. అక్కడి నుంచి బయట పడేందుకు కిలాడీ లేడి ఇంకో చోట పూజ చేయాలి త్వరగా వస్తానని ప్రధాన రహదారిపైకి చేరి కానిస్టేబుల్ సుబ్బరాయుడు మఫ్టీలో బైక్‌లో వెళ్తుండడంతో ఆపి ఎక్కింది. బాధితురాలు శ్రావణి పక్కింట్లో ఉండే మరో మహిళ బంగారు తీసుకెళుతోందని కేకలు వేయడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ బైక్‌ను వెనక్కి తిప్పి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఏటీఎం వద్దకు రాగానే కిందకు దూకే ప్రయత్నం చేసింది. అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.(చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) -
మృతిచెందిన శిశువు బతకాలని పూజలు!
►మృతిచెందిన శిశువును బతికించేందుకు మూడు రోజులుగా పూజలు బరంపురం(ఒడిశా): కటక్ పెద్దాస్పత్రిలో మూడేళ్ల శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించినప్పటికీ ఆ శిశువును బతికించేందుకు గ్రామస్తులు గుడ్డిగా మూఢనమ్మకంతో మూడురోజులుగా తాంత్రిక పూజలు చేసిన సంఘటన గంజాం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. మృతిచెందిన శిశువు సాయినంద్‌కు దహనసంస్కారాలు చేసేందుకు శ్మశానానికి తీసుకువెళ్లగా అక్కడ శిశువు కాళ్లు చేతులు కదలడంతో శిశువు సాయినంద్ బతికి ఉన్నట్లు అనుమానించారు. దీంతో తల్లితో సహా గ్రామస్తులు ఊరిశివారు చెట్టుకింద శిశువును ఉంచి బతికించుకునేందుకు మూడురోజులుగా తాంత్రిక పూజలు చేసిన సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేగింది. గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం గంజాం జిల్లా ఛత్రపూర్ బ్లాక్ పరిధిలో గల సుందరపూర్ గ్రామంలో గల మజ్జిడియా వీధిలో నివాసం ఉంటున్న కుటుంబంలో 3 ఏళ్ల శిశువు సాయినంద్‌కు కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో ఛత్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. సాయినంద్ పరిస్థితి విషమించడంతో బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు కటక్ పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. కటక్ పెద్దాస్పత్రిలో శిశువు సాయినంద్‌కు వైద్యులు చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతి చెందిన సాయినంద్ను కుటుంబసభ్యులు సుందరపూర్ సొంత గ్రామానికి తీసుకువచ్చి గ్రామస్తుల సహకారంతో దగ్గరలో ఉన్న శ్మశానానికి తరలించగా అక్కడ సాయినంద్ కాళ్లు చేతులు అడడంతో బంధువులు అనుమానంతో ఊరి శివారు మామిడి తోట కింద శిశువును ఉంచి గత 5వ తేదీ నుంచి మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారు. తాంత్రిక పూజలతో శిశువును బతికించుకోవాలని గ్రామస్తులు కూడా వెయ్యిమందికి పైగా చేరి రాత్రి పగలు పూజల్లో పాల్గొన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా మరో రోజు ఊరుకోవాలని శిశువును బతికించుకుంటామని కుటుంబసభ్యులు పోలీసులను కోరగా వెళ్లిపోయినట్లు తెలిసింది. అధునిక ప్రపంచీకరణ యుగంలో మూఢనమ్మకాలతో ఇంకా తాంత్రిక విద్యలతో మృతశిశువును బతికించుకునేందుకు సుందరపూర్ గ్రామస్తుల ప్రయత్నం శుక్రవారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా సుందరపూర్ గ్రామస్తులు శిశువును విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.