
డివైడర్ ఎక్కిన కారు
సాక్షి, కరీంనగర్ : వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హాజ్ సమీపంలో ఓ కొత్త బెలెనో కారు అదుపు తప్పి డివైడర్ గోడ ఎక్కింది. ప్రదాన రోడ్డులో డివైడర్ ఎక్కకుండా ముందుకు దూసుకెళ్తే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అభిప్రాయపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. ఈ కారు సిరిసిల్లకు చెందిన రవీందర్‌దిగా గుర్తించారు. కారులో ఆయనతోపాటు డ్రైవర్ ఉండగా వారికి ఏలాంటి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment