
సాక్షి, కరీంనగర్ : భార్య, కొడుకు ఉండగానే మరో మహిళతో కాపురం పెట్టిన నిత్యపెళ్లి కొడుక్కి, భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేశారు. తాళ్లతో బంధించి చెప్పులతో, కర్రలతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన కొండి సంపత్ కరీంనగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 2016లో మానకొండూరు మండలం గూడూరుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వారికి బాబు జన్మించాడు. భార్య కొడుకు ఉండగా సంపత్ మరో మహిళతో కరీంనగర్‌లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య భాగ్యలక్ష్మి బంధువులతో కలిసి కరీంనగర్‌కి వెళ్లి సంపత్‌ను రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా పెళ్లి పేరుతో నలుగురి మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచారు.
సంపత్,భాగ్యలక్షిల పెళ్లి ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment