
సాక్షి, సిరిసిల్ల: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో ‘రంగినేని ఎల్లమ్మ’సాహిత్య పురస్కారాన్ని ఏటా అందిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్య పురస్కారం కోసం 2018, 2019, 2020 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కథా సంపుటాలు ఐదు ప్రతులు అక్టోబర్ 31లోగా పంపించాలని అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ కోరారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కింద రూ.21 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రాన్ని 2021 జనవరిలో అందిస్తామని పేర్కొన్నారు. కథా సంపుటాలు పంపాల్సిన అడ్రస్ రంగినేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల–505 301, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇతర వివరాలకు 94416 77373ని సంప్రదించాలని కోరారు.