ellamma
-
‘రంగినేని’ పురస్కారానికి కథా సంపుటాలకు ఆహ్వానం
సాక్షి, సిరిసిల్ల: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో ‘రంగినేని ఎల్లమ్మ’సాహిత్య పురస్కారాన్ని ఏటా అందిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్య పురస్కారం కోసం 2018, 2019, 2020 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కథా సంపుటాలు ఐదు ప్రతులు అక్టోబర్ 31లోగా పంపించాలని అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ కోరారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కింద రూ.21 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రాన్ని 2021 జనవరిలో అందిస్తామని పేర్కొన్నారు. కథా సంపుటాలు పంపాల్సిన అడ్రస్ రంగినేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల–505 301, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇతర వివరాలకు 94416 77373ని సంప్రదించాలని కోరారు. -
భక్తుల కల్పవల్లి.. ఎల్లమ్మ తల్లి
మావురాల మాతల్లిగా.. పేదింటి ఎల్లమ్మగా.. పసుపు బండారు తల్లిగా.. పేదల ఇలవేల్పుగా.. పోలెపల్లి ఎల్లమ్మ దేవత.. భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. కొన్ని శతాబ్దాలుగా భక్తులు ఆరాధిస్తున్నారు. పోలెపల్లి తల్లి దర్శనానికి ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బొంరాస్‌పేట మండలం శివారులోని మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం పోలెపల్లి గ్రామంలో ఎల్లమ్మమాత కొలువై ఉన్నారు. ఈనెల 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. బొంరాస్‌పేట(కొడంగల్): దేవస్థానం ఏర్పాటుకు ముందునుంచి ఓ పూర్వగాథ ప్రచారంలో ఉంది. 5 శతాబ్దాల క్రితం.. ఈ దేవస్థానం స్థలంలో రైతు గడెంపనులు చేస్తున్నారు. భూమి చదును చేసేందుకు తన గుంటకపై ఓ రాతిని ఉంచి, పనులు పూర్తిగానే సాయంత్రం ఆ రాతిని గట్టున ఉంచి వెళ్లేవారట. మరునాడు వచ్చేసరికి గట్టున ఉంచిన రాయి పొలం నడిబొడ్డున ఉండటం చూసి ఆశ్చర్యపోగా, ఇలా పలుమార్లు జరుగగా రైతు పరికించి చూశాడు. ఒకనాడు రైతుకు.. ‘మహిమగల మావురాల తల్లిని నేను. ఇక్కడే స్థిర నివాసముండి భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటాను. ఆలయం నిర్మించు భక్తుడా’.. అంటూ రైతుకు కలలో వచ్చి ఎల్లమ్మ దేవత చెప్పిందట. నాడు చిన్నపాటి గుడిని ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఇంతింతై దేవస్థానంగా లక్షలాది భక్తుల పూజలందుకోవడం విశేషం. బోనపు నైవేద్యాలు జాతరలో ప్రత్యేకంగా బోనాలు, బ్యాండుమేళాలు, డప్పులతో, పూనకాలతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. నుదుటికి పసుపు, కుంకుమ తిలకాలు, తెల్లని, పసుపురంగు వస్త్రాలు ధరించి తమ ప్రత్యేక భక్తిని చాటుకుంటారు. బారులుతీరుతూ, గుంపులు గుంపులుగా బోనాల శ్రేణులు దేవస్థానంలో సందడి చేస్తాయి. ఈజాతరలో బోనాల పూజలు ప్రత్యేకం. షోలాపూర్ భక్తుల ప్రత్యేకం.. జాతర భ్రహ్మోత్సవాలకు ప్రతియేటా తెలంగాణ ప్రాంతంలోని భక్తులతోపాటు మçహారాష్ట్ర, కర్ణాటక, బీవండి, షోలాపూర్ తదితర ప్రాంత్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సకుటుంబంగా వచ్చి పూజల్లో, సిడే కార్యక్రమాల్లో షోలాపూర్ భక్తుల సేవలు, పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వారంలో మూడు రోజులు.. ఆలయంలో జాతర సమయంలోనే కాకుండా ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి ప్రత్యే పూజలు, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మూడు రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సిడే ఘట్టమే ప్రధానం.. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం సాయంత్రం జరిగే ‘సిడే’ ఘట్టం ప్రత్యేకను చాటుతోంది. ఈ ఘట్టమే మావురాల తల్లికి మకుటంగా నిలుస్తోంది. దీన్ని తిలకించి తరించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన సిడేపై తొట్లాలలో ఉంచి దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గవ్వల బండారు చల్లుతూ భక్తులు తమమొక్కులు తీర్చుకుంటారు. జాతర కార్యక్రమాలు ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరగనున్నాయి. గురువారం రాత్రి పల్లకీసేవ (వేంచేపు కార్యక్రమం) కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో ఊరిలో నుంచి ఆలయానికి అమ్మవారు చేరుకుంటారు. శుక్రవారం జాతర ప్రధానఘట్టమైన సిడే(రథోత్సవం) కార్యక్రమం సాయంత్రం ఉంటుంది. శనివారం ఉదయం తేరులాగే కార్యక్రమం, ఆదివారం భక్తుల ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని దేవాలయ మేనేజరు రాజేందర్‌రెడ్డి తెలిపారు. అమ్మవారి మహిమ.. పాపాలను రూపుమాపే ‘పసుపు బండారు’ ఎల్లమ్మ దేవత జాతరకు శాస్త్రీయ నేపథ్యం ఉందని చెప్పవచ్చు. పూర్వం వైద్యశాస్త్రం ఇంతగా అభివద్ధి చెందని కాలంలో ఆయుర్వేద వైద్యమే అందుబాటులే ఉండేది. తట్టు, మసూచి వంటి చర్మవ్యాధులకు వేపాకులు, పసుపు చికిత్సకు ఉపయోగించడం పరిపాటిగా ఉండేది. గ్రామదేవతల్లో ఒకరైన ఎల్లమ్మ ఇలాంటి వ్యాధులకు చికిత్స చేసేదనే నానుడికి ఎల్లమ్మ జాతరలో వేప ఆకులతో పూనకాలు, పసుపు బండారుతో పూజలు చేయడం అందుకు నిదర్శనం. అమ్మవారి పసుపు బండారు, వేపాకుల ధరింపుతో రోగాలు, పాపాలు తొలగిపోతాయని అమ్మవారి భక్తుల విశ్వాసం. అప్పటినుంచి పోలెపల్లి ఎల్లమ్మ దేవతను ఇలవేల్పుగా కొలుస్తున్నారు. మరో జోగులాంబ దేవస్థానం ఆలయ అభివృద్ధి కోసం గతేడాది దేవాదాయ శాఖ నుంచి రూ. 25లక్షలు మంజూరుకాగా భక్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం, మండపాలు నిర్మించాం. అమ్మవారి ఆశీర్వాదంతో నా సొంత ఖర్చులతో భక్తులకు విశాలమైన ప్రాంగణంతోపాటు ఆలయ శిఖరం కొత్త హంగులతో అలంపూర్ జోగిలాంబను తలపించే విధంగా నిర్మించాం. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించనున్నాయి. – ముచ్చటి వెంకటేశ్, ఆలయకమిటీ చైర్మన్, -
డెంగీతో మహిళ మృతి
దుగ్గొండి: డెంగీతో జ్వరంతో బాధపడుతున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం ఆదిలక్ష్మీపూరం గ్రామానికి చెందిన సంప ఎల్లమ్మ(30) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. డెంగీ వచ్చిందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. -
తల్లి అంత్యక్రియలకు వస్తూ కూతురు దుర్మరణం
చిన్నమడూరు (దేవరుప్పుల) : తల్లి చావు కబురు విని పుట్టెడు దుఃఖంతో కొడుకుతో బైక్‌పై వస్తూ ప్రమాదవశా త్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు మృత్యువాత పడింది. మండలంలోని చిన్నమడూరు గ్రామానికి చెంది న గూడ సోమక్క(80) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయం తెలిసి ఆమె కూతు రు బీసు ఎల్లమ్మ కొడుకు శ్రీనివాస్‌తో బైక్‌పై మోత్కూరు నుంచి బయల్దేరింది. గుండాల మండలం కొండూరు క్రాస్‌రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఎల్లమ్మ(56) తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి వెళ్లింది. చికిత్సనిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండ గా మార్గమధ్యలో చనిపోరుుంది. శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యారుు. ఇద్దరి మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నారుు. -
భార్య, కూతురు హత్య.. ఆపై దహనం
మెదక్ జిల్లాలో ఓ కిరాతకుడి ఘాతుకం చేగుంట: భార్య, కూతురిని హత్య చేసి ఆపై దహనం చేశాడో కిరాతకుడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లం, ఎల్లవ్వ దంపతులకు శృతి అనే మూడేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా ఎల్లవ్వను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం అత్త లక్ష్మి, భర్త ఎల్లంలు గొడవ పెట్టుకొని ఎల్లవ్వను కొట్టారు. మనస్తాపం చెందిన ఆమె తన కూతురు శృతి(3)ని తీసుకొని పొలం వద్దకు వెళ్లింది. అక్కడికీ వచ్చిన భర్త మరోసారి గొడవపడి భార్య, కూతురిని హత్య చేసి.. అనంతరం దహనం చేశాడు. ఈ ఘటనను ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు యత్నించాడు. ఏం తెలియనట్టుగా తన భార్య ఇంటికి రాలేదని నాటకమాడి గ్రామస్తులతో వెతికించాడు. ఎక్కడా దొరక్క పోవడంతో పొలం వద్దకు వెళ్లి ఉంటుందని అక్కడికి వెళ్లాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లిచూడగా ఎల్లవ్వతోపాటు కూతురు శృతి మంటల్లో కాలిపోయి విగత జీవులుగా కనిపించారు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడితే, మంటలకు పరిగెత్తే వారని, కాలిపోయి మంటలంటుకున్న చోటే శవాలు పడి ఉండటంతో ఇది ముమ్మాటికి హత్యేనని ఎల్లవ్వ తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ముదిరిన ‘ఎల్లమ్మ' వివాదం
సిరిసిల్ల రూరల్ : మల్లాపూర్ ఎల్లమ్మ ఆలయ వివాదం ముదిరింది. రెండు గ్రామాల ప్రజలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఆలయం తమదంటే తమదని జిల్లెల, మల్లాపూర్ వాసులు ఆదివారం ఒకరిపై ఒకరు కట్టెలతో దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. వివరాలు.. నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న రెండు గ్రామాల ప్రజలు పంచాయతీల విభజనతో శత్రువులయ్యారు. జిల్లెల్ల పరిధిలోని మల్లాపూర్, ఇందిరానగర్‌లను వేరు చేసి ప్రభుత్వం ఇటీవలే ఇందిరానగర్ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసింది. మల్లాపూర్‌లో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 40 సంవత్సరాలుగా జిల్లెల్ల గౌడ సంఘం నిర్వహణలో ఉంది. పంచాయతీల విభజనతో ఎల్లమ్మ దేవాలయం ఇందిరానగర్ పంచాయతీలోకి వచ్చిందని.. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ, అభివృద్ధి తామే చూసుకుంటామని మల్లాపూర్ ప్రజలు నిర్ణయించారు. కాదుకాదు ఆలయం మాదేనని.. అన్ని మేమే చూసుకుంటామని జిల్లెల్ల గౌడ సంఘం వారు మల్లాపూర్ వాసులకు తేల్చిచెప్పారు. ఈ రెండు గ్రామాల మధ్య ఈ విషయమై నాలుగు నెలలుగా వివాదం కొనసాగుతోంది. విషయం పోలీసులకు చేరడంతో సిరిసిల్ల పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆర్డీవో బిక్షానాయక్, తహశీల్దార్ ప్రభాకర్‌లు ఇప్పటికి మూడు సార్లు రెండు గ్రామాల ప్రజలను సిరిసిల్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక కమిటీ వేసుకుని ఆలయ నిర్వహణ చేపట్టాలని సూచించారు. కానీ.. మధ్యలో జిల్లెల గౌడ సంఘం వారు గుడి నిర్వహణ హక్కు తమకే ఉంటుందని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో కథ మొదటికొచ్చింది. ఆదివారం జిల్లెల నుంచి సుమారు 200 మంది, మల్లాపూర్‌కు చెందిన 150 మంది ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నారు. రెండు గ్రామాల ప్రజలు ఆలయం మాదంటే మాదని ఆందోళనకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. తలలు పగులగొట్టుకున్నారు. ఈ ఘటనలో 31 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. క్షతగాత్రులను 108, పోలీసు జీపు, ఆటోల్లో సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఏఎస్సై చీనా నాయక్ సంఘటన విచారణ చేపట్టారు. దేవాలయానికి తాత్కలికంగా తాళం వేయించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని.. చట్టరీత్య చర్యలు తప్పవని సీఐ ఇరు వర్గాలను హెచ్చరించారు. తమపైనే దాడి చేశారంటే.. తమపైనే దాడి చేశారని ఇరు గ్రామాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై డీఎస్సీ దామెర నర్సయ్య విచారణ జరుపుతున్నారు. గాయపడ్డది వీరే.. మల్లాపూర్‌కు చెందిన సామనపల్లి బాబు, దయా కిరణ్, మద్దెల రాజయ్య, బాస బాలయ్య, ఎల్లవ్వ, తాటిపల్లి ఎల్లవ్వ, లక్ష్మి, బొదపల్లి మల్లయ్య, బచ్చపల్లి రాజయ్య, మద్దెల లక్ష్మీనారయణ, చిమలపల్లి సంతోష్, దేవనర్సింహులు, రాములు, బర్ల రాజయ్య, మందరపు శ్రీనివాస్, మల్లేవారి బాలయ్య, ఎర్ర శ్రీను, ప్రకాశ్, జిల్లెల్లకు చెందిన బొల్గం రాములు గౌడ్, పూనం తిరుపతి, కోడూరి మల్లేశం, కట్కూరి మల్లేశం, కట్కూరి కిషన్, అంజయ్య, కోడూరి సత్యనారయణ, హన్మండ్లు, బాలయ్య, లింగం, కోడూరి యాదయ్య, వ సుద గాయపడ్డారు. వీరిలో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి, బాబు, రాముల పరిస్థితి విషమంగా ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. జిల్లెల్ల, మల్లాపూర్ గ్రామాల ప్రజలు సంయయనం పాటించాలని డీఎస్పీ దామెర నర్సయ్య కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని.. చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘర్షణకు దారి తీసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దేవుళ్ల పేరిట ఘర్షణలకు పాల్పడటం సబబు కాదని, కలసి మెలసి ఉండాలన్నారు. -
సర్పంచైనా.. కూలి మానలే!
అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టం ఆమెను సర్పంచ్‌ను చేసినా.. ఆమె మాత్రం సాదాసీదాగా బతికేందుకే ఇష్టపడుతున్నారు. గ్రామానికి ప్రథమ పౌరురాలు అయినా జీవనం కోసం మొదటి నుంచీ చేస్తున్న కూలి పనులను మాత్రం వదలడం లేదు. ఓ వైపు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తూనే మరోవైపు కూలి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పరకాల మండలం రాజిపేట సర్పంచ్ తూర్పాటి ఎల్లమ్మ. - పరకాల కష్టపడడంలో ఆనందం కష్టపడి పనిచేసి సంపాదించాలనే సర్పంచ్‌నైనా రోజూ కూలికి పోతున్న. కష్టపడడంలో ఆనంద ం ఉంది. రూ.30 కూలి ఉన్నప్పుడు నుంచి వెళ్తున్న. ఇప్పుడు రోజుకు రూ.180 వస్తున్నయ్. కూలికొస్తున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్న. ఉదయం ఎవరికైనా పనులుంటే చేసి తర్వాత పరకాల వచ్చి పనిచేస్తున్న. మా ఊర్లో సీసీ వేసిన. సైడ్ కాల్వలు తీసిన. గుడుంబా అమ్మవద్దని చెప్పిన. - ఎల్లమ్మ, సర్పంచ్ పారతో సిమెంటు కలుపుతున్న ఈమె పేరు తూర్పాటి ఎల్లమ్మ. ఊరు.. పరకాల మండలంలోని రాజిపేట. చిన్నప్పటి నుంచి ఆమె కూలి పనులకు వెళ్లేది. ఎల్లమ్మ భర్త కుమార్ బోళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆయన సంపాదనకు కాస్తంత తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో పెళ్లయిన తర్వాత కూడా ఓ తాపీమేస్త్రీ వద్ద ఎల్లమ్మ మళ్లీ పనికి కుదిరింది. ఇందులో వింతేముంది.. భార్యభర్తలు సంపాదిస్తేనే కానీ రోజు గడవని కాలం.. అని ఊరికే కొట్టిపారేయకండి. ఎందుకంటే ఆమె ఓ ప్రజాప్రతినిధి. పరకాల మండలంలోని రాజిపేట గ్రామ సర్పంచ్. అయ్యో.. ఈ మాత్రానికే ఆశ్చర్యపోతే ఎలా.. ఇంకా చాలాఉంది. చదవండి మరి. - పరకాల గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అదృష్టం ఎల్లమ్మ ఇంటి తలుపు తట్టింది. తలుపుతీసి ఎదురుగా ఉన్న అదృష్టాన్ని చూసి ఎగిరి గంతేయలేదు. సాదరంగా ఆహ్వానించింది. పంచాయతీ ఎన్నికల్లో రాజిపేట ఎస్సీకి రిజర్వు అయింది. ఊర్లో అందరితో మంచిగా ఉంటూ తనపనేదో తను చేసుకుపోయే ఎల్లమ్మ అప్పుడు అందరి దృష్టిలో పడింది. ఆమెను సర్పంచ్‌ను చేస్తే అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా గ్రామానికి మంచి చేస్తుందని అందరూ భావించారు. అనుకున్నదే ఆలస్యం అన్నట్టు ఆమెను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేకాదు ఉపసర్పంచ్, వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేశారు. దీంతో గ్రామంలో ఎన్నికలు నిర్వహించకుండానే పాలకవర్గం కొలువుదీరింది. అకస్మాత్తుగా వచ్చి ఒళ్లో వాలిన అదృష్టానికి ఎల్లమ్మ ఉబ్బితబ్బిబ్బయింది. పట్టలేని ఆనందంతో పొంగిపోయింది. భర్తకు చేదోడుగా.. అందివచ్చిన అవకాశంతో గ్రామంలో మొదటి పౌరురాలు అయినా ఎల్లమ్మ కూలికెళ్లడం మానలేదు. ఉదయం కార్యాలయానికి వెళ్లి పనులు చక్కబెట్టుకోవడం, తర్వాత కూలికి వెళ్లడం.. ఇదీ ఆమె దినచర్య. సర్పంచ్నన్న అహా న్ని పక్కనపెట్టి కూలికెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. సభ లు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం కూలికి పుల్‌స్టాప్ పెడుతున్నారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. నిరక్ష రాస్యురాలైన ఎ ల్లమ్మకు సంతకం చేయడం మాత్రం వచ్చు. గ్రామాభివృద్ధికి ఈమె ఏం చే స్తుందన్న విమర్శలను పటాపంచలు చేస్తూ ఊర్లో సీసీరోడ్డు వేయిం చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు బావిని అద్దెకు తీసుకుని గ్రామస్తులకు నీటిసమస్యలు రాకుండా చూశారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు వింటూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఈ కూలీ సర్పంచ్ ఇప్పుడు అందరికీ ఆదర్శమయ్యారు.