తల్లి అంత్యక్రియలకు వస్తూ కూతురు దుర్మరణం | Coming to the funeral of the mother and daughter killed | Sakshi
Sakshi News home page

తల్లి అంత్యక్రియలకు వస్తూ కూతురు దుర్మరణం

Published Wed, Nov 2 2016 2:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

తల్లి అంత్యక్రియలకు వస్తూ   కూతురు దుర్మరణం - Sakshi

తల్లి అంత్యక్రియలకు వస్తూ కూతురు దుర్మరణం

చిన్నమడూరు (దేవరుప్పుల) : తల్లి చావు కబురు విని పుట్టెడు దుఃఖంతో కొడుకుతో బైక్‌పై వస్తూ ప్రమాదవశా త్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు మృత్యువాత పడింది. మండలంలోని చిన్నమడూరు గ్రామానికి చెంది న గూడ సోమక్క(80) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయం తెలిసి ఆమె కూతు రు బీసు ఎల్లమ్మ కొడుకు శ్రీనివాస్‌తో బైక్‌పై మోత్కూరు నుంచి బయల్దేరింది.

గుండాల మండలం కొండూరు క్రాస్‌రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఎల్లమ్మ(56) తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి వెళ్లింది. చికిత్సనిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండ గా మార్గమధ్యలో చనిపోరుుంది. శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యారుు. ఇద్దరి మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement