
ఆది శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతున్న రుద్రవరం ప్రజలు
వేములవాడరూరల్ : రుద్రవరం గ్రామస్తులు ఆది శ్రీనివాస్ సమక్ష్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కట్ట శ్రీనివాస్ తన పదవికి, పార్టీకి రాజీనామ చేసి ఆది సమక్షంలో కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక కనుకయ్యతో పాటు ఉప సర్పంచ్ స్వామి కలిసి గ్రామంలోని దాదాపు 50 మంది యువకులు ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా నిలిచారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామ చేసినట్లు ప్రకటించారు.