
టీఆర్‌ఎస్ కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్
టేకులపల్లి: టీఆర్‌ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది. కోయగూడెంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుని అవమానించారన్న ఆగ్రహంతో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కలిసి టేకులపల్లిలోని టీఆర్‌ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు.
ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం శుక్రవారం ప్రచారం చేస్తున్నారు. ఆమెను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు.. టీఆర్‌ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించి ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టేకులపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి బోడ సరితకు చెందిన ప్రచార వాహనం అద్దం పగులకొట్టారు. సీఐలు నాగరాజు, వేణుచందర్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment