trs office
-
‘కారు’చౌకగా భూములెలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి బంజారాహిల్స్‌లో స్థలం కేటాయింపుపై వివరాలివ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఆదేశాలిచ్చింది. టీఆర్ఎస్కు రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో కారుచౌకగా భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కె.మహేశ్వర్‌రాజ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ‘గుర్తింపు పొందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో గజానికి రూ. 100 చొప్పున ఎకరం స్థలం కేటాయించేలా 2018లో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ క్రమంలో 2022 మే 11న బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం గజానికి రూ. 100 చొప్పున 4,935 గజాలను రూ. 4,93,500కు ప్రభుత్వం కేటాయించింది. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ గజానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలు ఉంటుంది. మొత్తం విలువ రూ. 110 కోట్ల వరకు ఉంటుంది. 33 జిల్లా కేంద్రాల్లో కూడా రూ. 100 చొప్పున ఎకరం స్థలం పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. ఈ స్థలం కేటాయింపులో సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించారు. 2005లో టీఆర్ఎస్కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పార్టీ కార్యాలయంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఓ చానల్‌ను కూడా నిర్వహిస్తు న్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు హైదరాబాద్‌లో స్థలం లేదంటున్న ప్రభుత్వం... పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించడం ఏకపక్ష నిర్ణయం’ అని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీసీఎల్ఏ, రెవెన్యూ సీఎస్, హైదరాబాద్ కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 20కి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: సీసీఎల్ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీ -
‘మన ఊరు–మన బడి’కి ఇక్కడి నుంచే శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి లాంఛనంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఇందుకు వేదిక కానుంది. దీంతోపాటు వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే నాగవరంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, కలెక్టరేట్ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. పోలీసుల పటిష్ట బందోబస్తు సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వనపర్తికి చేరుకోనుండగా.. సాయంత్రం 5.30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ఎస్పీల పర్యవేక్షణలో 1,840 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు లక్ష మందిని బహిరంగసభకు తరలించేలా ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
కేసీఆర్ ఢిల్లీ టూర్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
-
ఢిల్లీలో టిఆర్ఎస్ కార్యాలయం
-
ప్రస్తుతం జిల్లాల్లో.. తర్వాత నియోజకవర్గాల్లో!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఈనెల 24న ఏకకాలంలో శంకుస్థాపన చేసేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. శంకుస్థాపన ఏర్పాట్లపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు శనివారం మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలతో జిల్లాల వారీగా ఫోన్లో సమీక్షించారు. భూమి పూజ జరిగే స్థలాలను శనివారం సాయంత్రంలోగా పరిశీలించి, ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు. నూతనంగా నిర్మించే పార్టీ భవనాల నమూనాను సీఎం కేసీఆర్ త్వరలో ఎంపిక చేస్తారని వెల్లడించారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల నడుమ మంచి ముహూర్తం ఉన్నందున శంకుస్థాపన నిర్వహించాలన్నారు. మంత్రుల ప్రాతినిథ్యం ఉన్నచోట ఆయా జిల్లా కేంద్రాల్లో వారే శంకుస్థాపన చేస్తారని, మిగతా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు నిర్వహిస్తారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ పక్షాన ఎన్నికైన ప్రాదేశిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించాలని పార్టీ కీలక నేతలకు సూచించారు. భూమి పూజలో పాల్గొనే తొమ్మిది మంది మంత్రులతోపాటు, 19 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల జాబితాను కేటీఆర్ విడుదల చేశారు. జిల్లాకు ఎకరా చొప్పున కేటాయింపు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వీలుగా ఈ నెల 18న సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ ఒక్కో జిల్లాలో ఎకరా చొప్పున భూమి కేటాయించింది. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 21న 24 జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాల నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 34 జిల్లాలకుగాను ఖమ్మంలో ఇదివరకే పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ కొద్ది రోజులకే గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఉన్నా, నగర శాఖ కోసం మరో కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలో కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలం కోసం పార్టీ అన్వేషిస్తోంది. మరో ఆరు జిల్లా కేంద్రాల్లో భూ కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది. రూ.19.20 కోట్లు పార్టీ నిధులు క్షేత్ర స్థాయిలో పార్టీని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్.. తొలుత జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పార్టీ పేరిట రూ.225 కోట్ల డిపాజిట్లు ఉండగా, వడ్డీ రూపంలో రూ.1.25 కోట్ల ఆదాయం వస్తోంది. పార్టీ నిధుల నుంచే ఒక్కో భవనానికి రూ.60లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో ఇంటికో పార్టీ కార్యకర్త ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్న టీఆర్ఎస్.. త్వరలో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలను నిర్మించాలనే యోచనలో ఉంది. నియోజకవర్గ కేంద్రాల్లో స్థల కేటాయింపులో సాధ్యాసాధ్యాలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి
టేకులపల్లి: టీఆర్ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది. కోయగూడెంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని అవమానించారన్న ఆగ్రహంతో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కలిసి టేకులపల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం శుక్రవారం ప్రచారం చేస్తున్నారు. ఆమెను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు.. టీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించి ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టేకులపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి బోడ సరితకు చెందిన ప్రచార వాహనం అద్దం పగులకొట్టారు. సీఐలు నాగరాజు, వేణుచందర్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. విచారణ చేపట్టారు. -
‘గులాబీ’ గూడుపై కసరత్తు
సాక్షి, జనగామ : గులాబీ గూడుపై టీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. పార్టీ సైనికుల బాగోగుల గురించి ప్రారంభించబోతున్న కార్యాలయం నిర్మాణం కోసం విస్తృతంగా అన్వేషణ జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే కేడర్‌కు అనువుగా ఉండే విధంగా కార్యాలయం నిర్మాణం ఉండాలనే ధ్యేయంగా ఆలోచనలు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల కార్యకర్తలకు కేంద్రంగా ఉండే స్థల సేకరణ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెలల్లోనే కార్యాలయం అందుబాటులోకి రావాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. త్వరగా స్థల సేకరణ చేసి కార్యాలయ నిర్మాణం చేపట్టాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సూచించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఎన్నికైన తర్వాత తొలిసారిగా గత సంవత్సరం డిసెంబర్ 20న జిల్లాకు వచ్చారు. కార్యకర్తల ఆశీర్వదసభలో పాల్గొన్న కేటీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నామని ఇక్కడే ప్రకటించారు. జిల్లాలోనే తొలిసారిగా ప్రకటించడంతో త్వరగా కార్యాలయం నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు స్థల సేకరణపై దృష్టి పెట్టారు. పరిశీలనలో నాలుగు ప్రాంతాలు.. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి బాలమల్లుతో కలిసి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. హైదరాబాద్ రోడ్డులోని ప్రస్తుత వన నర్సరీ సమీపంలోని కుమ్మరికుంట, చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్ ఆస్పత్రి పక్కన, హన్మకొండ రోడ్డులోని దయ నిలయం సమీపంలోని ప్రభుత్వ స్థలం, సూర్యాపేట రోడ్డులోని ప్రస్తుత కలెక్టరేట్ నిర్మాణం జరుగుతున్న వెనుక ప్రాంతాన్ని పరిశీలించారు. దయ నిలయం వైపే మొగ్గు.. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 4750 గజాల స్థలం(ఎకరం) కావాల్సి ఉంది. పార్కింగ్ స్థలంతోపాటు, రవాణా సౌకర్యం, పార్టీ కార్యక్రమాలకు అనువైన స్థలం ఉండే విధంగా చూస్తున్నారు. అయితే చంపక్‌హిల్స్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తే కేవలం జనగామ నియోజకవర్గానికి మాత్రమే అనువుగా ఉంటుందని, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు దూరంగాఉంటుందనే వాదనను పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కుమ్మరికుంట, దయనిలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలం అయితే బెటర్‌గా ఉంటుందని పార్టీ నాయకులకు వివరించారు. సూర్యాపేటరోడ్డులో అయితే అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ కలెక్టరేట్ కోసం సేకరించిన స్థలం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. స్థలంతోపాటు, పార్కింగ్, రవాణా సౌకర్యం పరంగా దయ నిలయం వెనుక ఉన్న స్థలంలోనే కార్యాలయం నిర్మిస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదనే పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. పక్కనే పోలీసు క్వార్టర్స్ ఉండడంతో సెక్యూరిటీ ప్రకారంగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పెద్ద నాయకులు వస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వన్‌వే ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా దయ నిలయం పక్కనే ఉన్న స్థలాన్ని అంబేడ్కర్ భవన నిర్మాణం కోసం కేటాయించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సైతం అందిస్తున్నారు. పండుగ తర్వాత ఫైనల్.. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం స్థలం ఖరారు సంక్రాంతి పండుగ తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. స్థల సేకరణ పూర్తయితే వెంటనే నిర్మాణం చేపట్టే ఆలోచన చేస్తున్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ నా టికి కార్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చే అవకా శం ఉందని పార్టీ నాయకుడొకరు వివరించారు. పార్టీ కా ర్యాలయం ఎక్కడ నిర్మిస్తారనే అంశం సొంత పార్టీ శ్రేణుల్లో కాకుండా రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. -
టీఆర్ఎస్ ఆఫీసుగా అసెంబ్లీ
♦ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అధికారపక్షం పని అని విమర్శ ♦ బడ్జెట్ కేటాయింపుల్లో 30–40 శాతం కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని సీఎల్పీ ఉప నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాల గొంతునొక్కడానికే అధికార టీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, వట్టి మాటలతోనే సభను మొక్కుబడిగా పూర్తి చేశారని దుయ్య బట్టారు. బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన లెక్కలన్నీ వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లో 30–40 శాతం కూడా ఖర్చు చేయకుండా, కేవలం అంకెల్లో మాయా జాలం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కేటాయింపుల్లేవని ధ్వజ మెత్తారు. ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడి తోనే కేజీ టు పీజీ అమలుచేయడం లేదని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం దురదృష్టకర మన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కొత్త విద్యుత్ ప్రాజెక్టు రాలేదని, ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కొత్తగా కూడా ఉత్పత్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో నియం తృత్వ ప్రభుత్వం నడుస్తున్నదని, ప్రతిపక్షాలను నిరంకుశంగా గొంతునొక్కుతున్నారని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిపై చర్చించకుండా అసెంబ్లీ సమావే శాలను ప్రభుత్వం ముగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలను సాగులోకి తెస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీలేదన్నారు. ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి, చేస్తున్న దొకటని ఆయన విమర్శించారు. -
ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదు
సాక్షి, గద్వాల : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని జిల్లాపరిషత్ చైర్మన్ భాస్కర్ అన్నారు. ఆదివారం గద్వాలలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరినందుకు తిరుపతిలో కానుకలు సమర్పిస్తే హర్షించాల్సింది పోయి స్థాయి దిగజారి మాట్లాడటం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ మాట్లాడుతున్న వారు చేతనైతే ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే జూపల్లి కృష్ణారావు అని పాన్గల్లో జెడ్పీటీసీగా గెలిపించింది మరిచిపోవద్దని సూచించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నెట్టెంపాడును పూర్తి చేసేందుకు కృష్ణమోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర కాంట్రాక్టర్ల మోచేతి నీళ్లు తాగింది.. ఆంధ్ర ప్రాజెక్టు ప్రారంభానికి హారతి పట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. జలయజ్ఞంను ధన యజ్ఞంగా మార్చి నడిగడ్డ ప్రాజెక్టు గుత్తేదారులను బెదిరించింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. స్త్రీని గౌరవించాలనే సంప్రదాయం టీఆర్ఎస్ నాయకులకు ఉంది కాబట్టి విమర్శించడం లేదన్నారు. అనవసరమైన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎంపీపీ సుభాన్, నాయకులు బీఎస్ కేశవ్,మహమూద్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు డిప్యూటీ సీఎం రాక
గద్వాలన్యూటౌన్ : నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య రానున్నారు. గద్వాలతోపాటు అచ్చంపేటలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. గద్వాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అమ్రాబాద్ మండలంలో నిర్వహించే అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొంటారు. ఏర్పాట్లు పూర్తి : జెడ్పీ చైర్మన్ మంత్రి పర్యటనకు ఏర్పా ట్లు పూర్తిచేసినట్టు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి గద్వాలకు చేరుకుంటారని, 3 గంటలకు గాంధీచౌక్ వద్ద నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. 3.45 గంటలకు ఏరియా ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన అదనపు వార్డులను ప్రారంభించిన తర్వాత నేరుగా గద్వాల టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొం టారన్నారు. ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బండారి భాస్కర్ తెలిపారు. వైద్యుల, సిబ్బంది ఖాళీలతో పాటు ఇతర సమస్యలను ఆయన వద్ద ప్రస్తావిస్తామని, ఆస్పత్రి వద్ద షాపింగ్ కాంప్లెక్స్, పూడూరులో పీహెచ్సీ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతామన్నారు. సమావేశంలో ఎంపీపీ సుభాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు మహిమూద్, మధుసూదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిగా ఖేడ్- బీదర్ రోడ్డు
* రూ.10కోట్లు మంజూరు ఎంపీ బీబీపాటిల్ నారాయణఖేడ్: నియోజకవర్గంలోని రహదారుల అభివృధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. నారాయణఖేడ్- బీదర్ రహదారి జాతీయ రహదారిగా మారనున్నదని, ఖేడ్ నుంచి సంత్పూర్ రహదారి నిర్మాణానికి రూ.10కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. శనివారంఖేడ్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఖేడ్ ప్రాంతాభివృద్ధికి పాటుపడతానన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా స్థానిక నేతలు ఎంపీని ఘనంగా సత్కరించారు. అంతకు ముందు కార్యకర్తలు పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు బిడెకన్నె హన్మంతు, వెంకట్రాంరెడ్డి, రవీందర్‌నాయక్, ప్రభాకర్, మారుతిపటేల్, ఇస్మాయిల్, నవాబ్, గోవింద్‌యాదవ్, మల్‌శెట్టియాదవ్, మారుతి యాదవ్, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్’ వాకౌట్
- రుణమాఫీ, పంట పరిహారంపై రగడ కరీంనగర్ : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం పంటనష్ట పరిహారం, రుణమాఫీ అంశంపై అట్టుడికింది. ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేసే వరకూ వెళ్లింది. సమావేశం ప్రారంభం కాగానే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పంటనష్ట పరిహారం రూ.108 కోట్లు విడుదల కాగా, వ్యవసాయశాఖ అధికారులు కేవలం రూ.18 కోట్లు రైతులకు చెల్లించి చేతులు దులుపుకున్నారని, నిధులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యమెందుకని మండిపడ్డారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్నారని, టైటిల్-1బీ అంటూ బ్యాంకులు అభ్యంతరాలు చెబుతున్నాయని, సభకు మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డి పదేపదే కోరారు. ఎమ్మెల్యే పుట్ట మధు జోక్యం చేసుకుని రైతుల పట్ల ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని ప్రాంతంలో నాయకులు దోచుకో... దాచుకో అన్న చందంగా ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. ఆదర్శరైతుల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, ఎకరం భూమిపైనే నాలుగైదు పేర్లు రాసి ఆదర్శరైతులే డబ్బులు కాజేశారని, తన నియోజకవర్గంలోని గద్దలపల్లి ఆదర్శరైతు వ్యవహారంపై వివరించారు. జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం మీదే ఉందని, విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనడంతో బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, శంకరపట్నం జెడ్పీటీసీ పి.సంజీవరెడ్డి జోక్యం చేసుకున్నారు. బెజ్జంకి మండలంలో పరిహారం రూ.5 కోట్లు వస్తే రూ.3 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చాయని విమర్శించారు. బెజ్జంకి వ్యవసాయాధికారిని సస్పెండ్ చేయాలని జేడీఏకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను చక్కదిద్దేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కాటారం జెడ్పీటీసీ నారాయణరెడ్డి జోక్యం చేసుకుని సీనియర్ ఎమ్మెల్యే అయిన జీవన్‌రెడ్డిని అలా సంబోధించడం సరికాదని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల పరస్పర విమర్శలు, అరుపులతో సభ దద్దరిల్లింది. గౌరవం లేని సభలో తాను ఉండబోనని జీవన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి మంత్రి ఈటెల, చైర్పర్సన్ ఉమతో వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు పుట్ట మధు, గంగుల కమలాకర్ జీవన్‌రెడ్డిని సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. చైర్పర్సన్ సభను నడిపించే ప్రయత్నం చేస్తుండగానే జీవన్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేసి ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలతో కలిసి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. జెడ్పీ భవనాన్ని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుని అమర్యాదగా ప్రవర్తించారని, క్షమాపణ చెప్పే వరకు జెడ్పీలో అడుగుపెట్టేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. 20 నిమిషాల పాటు నిరసన తెలపగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, సతీశ్‌బాబు తదితరులు జీవన్‌రెడ్డితో మాట్లాడి సభలోకి రావాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో సభ్యులతో కలిసి ఆయన తిరిగివచ్చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మనసు బాధకలిగితే క్షమించాలని బెజ్జంకి జెడ్పీటీసీ శరత్‌రావు కోరడంతో గొడవ సద్దుమణిగింది. -
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కరెంట్ కష్టాలు
నల్లగొండ రూరల్ : గత కాంగ్రెస్, టీడీపీ పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కేవలం హైడల్ థర్మల్ పవర్‌పైనే ఆధారపడాల్సి వస్తుందన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు నార్త్ కారిడార్ నుంచి సౌత్వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల సభలోనే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటుందని ప్రజలకు వివరించామన్నారు. విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయని, ఇందుకు కారణం గత టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వైఖరేనని తెలిపారు. అలాంటి వారు నేడు ఫ్యాషన్ కోసం టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారన్నారు. సీఎం మొదటి కేబినెట్లోనే 40 అంశాలమీద నిర్ణయం తీసుకుని చరిత్ర సృష్టించారన్నారు. వెయ్యిమంది అమరత్వంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ అంటే మలినం లేని, మలినమంటని పార్టీ అన్నారు. పార్టీలో పనిచేసిన వారికి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో చకిలం అనిల్‌కుమార్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, జి. వెంకటాచారి, ఫరీద్, పున్న గణేష్, షేక్ కరీంపాష, బోయపల్లి జానయ్య, చింత శివరామకృష్ణ, సాయి, జమాల్‌ఖాద్రి, శ్రీను, సురేందర్, అరుణాకర్ పాల్గొన్నారు. -
పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పొలిట్ బ్యూరో సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభమయింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు కూడా భేటీకి హారయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభించవచ్చని టీఆర్ఎస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలిట్ బ్యూరో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతుతోపాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల్లో, నేతల్లో నెలకొన్న పలు సందేహాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.