గద్వాలన్యూటౌన్ : నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య రానున్నారు. గద్వాలతోపాటు అచ్చంపేటలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. గద్వాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అమ్రాబాద్ మండలంలో నిర్వహించే అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొంటారు.
ఏర్పాట్లు పూర్తి : జెడ్పీ చైర్మన్
మంత్రి పర్యటనకు ఏర్పా ట్లు పూర్తిచేసినట్టు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి గద్వాలకు చేరుకుంటారని, 3 గంటలకు గాంధీచౌక్ వద్ద నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. 3.45 గంటలకు ఏరియా ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన అదనపు వార్డులను ప్రారంభించిన తర్వాత నేరుగా గద్వాల టీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొం టారన్నారు.
ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బండారి భాస్కర్ తెలిపారు. వైద్యుల, సిబ్బంది ఖాళీలతో పాటు ఇతర సమస్యలను ఆయన వద్ద ప్రస్తావిస్తామని, ఆస్పత్రి వద్ద షాపింగ్ కాంప్లెక్స్, పూడూరులో పీహెచ్‌సీ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతామన్నారు. సమావేశంలో ఎంపీపీ సుభాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు మహిమూద్, మధుసూదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు డిప్యూటీ సీఎం రాక
Published Sat, Dec 6 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement