పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ | Telangana Rashtra Samiti politburo meeting | Sakshi
Sakshi News home page

పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ

Published Fri, May 9 2014 3:02 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ - Sakshi

పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పొలిట్‌ బ్యూరో సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభమయింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు కూడా భేటీకి హారయ్యారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభించవచ్చని టీఆర్ఎస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలిట్ బ్యూరో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ,  కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతుతోపాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల్లో, నేతల్లో నెలకొన్న పలు సందేహాలపై  కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement