TRS Politburo meeting
-
పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పొలిట్ బ్యూరో సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభమయింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు కూడా భేటీకి హారయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభించవచ్చని టీఆర్ఎస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలిట్ బ్యూరో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతుతోపాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల్లో, నేతల్లో నెలకొన్న పలు సందేహాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలవదు: కేసీఆర్
-
కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలవదు: కేసీఆర్
హైదరాబాద్: తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం చేయబోమని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలపొద్దని తెలంగాణ వ్యాప్తంగా తనకు వేల సందేశాలు వచ్చాయని తెలిపారు. విభజన విషయంలో ఏ ఒక్క సందర్భంలోనూ కాంగ్రెస్ తమను సంప్రదించలేదన్నారు. బిల్లు రూపకల్పనలో తమను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాము అడిగింది ఏమీ కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ ఇవ్వలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కాబట్టి ఇక నుంచి టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీగా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయం కేశవరావు నేతృత్వంలో ఏర్పడే కమిటీ చూసుకుంటుందన్నారు. సోనియాను కొందరు నాయకులు తప్పుదారి పట్టించారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.