కాంగ్రెస్తో టీఆర్ఎస్ కలవదు: కేసీఆర్ | trs-unanimously-decided-not-merge-with-congress-says-kcr | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 3 2014 9:59 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్లో విలీనం చేయబోమని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ పొలిట్బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలపొద్దని తెలంగాణ వ్యాప్తంగా తనకు వేల సందేశాలు వచ్చాయని తెలిపారు. విభజన విషయంలో ఏ ఒక్క సందర్భంలోనూ కాంగ్రెస్ తమను సంప్రదించలేదన్నారు. బిల్లు రూపకల్పనలో తమను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాము అడిగింది ఏమీ కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ ఇవ్వలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కాబట్టి ఇక నుంచి టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీగా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయం కేశవరావు నేతృత్వంలో ఏర్పడే కమిటీ చూసుకుంటుందన్నారు. సోనియాను కొందరు నాయకులు తప్పుదారి పట్టించారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement