వేములవాడ అర్బన్ :వరంగల్ జిల్లా నుంచి వేములవాడ ప్రాంతానికి గంజాయి సరఫరా అవుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సై జ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ తెలి పారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతర సందర్భంగా ఎక్సైజ్‌శాఖ పక్షం రోజుల ముందునుంచే దాడులు నిర్వహించిందని, 50 వేల లీట ర్ల బెల్లం పానకం, పదివేల లీటర్ల గుడుంబా ధ్వంసం చేశామని పేర్కొన్నారు. 20 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. బుధవారం నిర్వహించిన దాడుల్లో రూ.10 వేల విలువైన మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
గుడుంబా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించామని, దీన్ని అరికట్టేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలో జరిపిన దాడుల్లో పదిన్నర కిలోల గంజాయి పట్టుకున్నామని, విచారణలో వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం ద్వారకారావుపేట నుంచి బస్సులో వేములవాడకు తరలించినట్లు తేలిందని స్పష్టం చేశారు.
నాంపల్లిలోని ఓ ఇంట్లో సంప్‌లో గంజాయి దాచిపెట్టారని తమ దాడుల్లో బయటపడిందని వెల్లడించారు. గుడుంబా, గంజాయి విక్రయించేవారి సమాచారం తమకు 9440902702 నంబర్‌లో సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రశేఖర్, వేములవాడ ఎస్‌హెచ్‌వో లక్ష్మణ్, ఎస్సైలు కిషన్, అశోక్, సమ్మయ్య, నరేశ్, రవీందర్‌రెడ్డి, రాములు, రాజన్న, సత్యనారాయణలు పాల్గొన్నారు.
వరంగల్ టు నాంపల్లి
Published Thu, Feb 19 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement