Vehicle accident
-
చిచ్చు రాజేసిన ఎండుగడ్డి.. 150 వాహనాలు అగ్నికి ఆహుతి
బెంగళూరు : శ్రీరామ్ పురాలో (srirampura) భాగీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. బెంగళూరు (bangalore) పోలీసు వివరాల మేరకు.. బెంగళూరు సిటీ పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల్ని జక్కరాయనకెరె ప్రాంతంలో రెండెకరాల స్థలంలో పార్క్ చేస్తుంటారు.ఈ నేపథ్యంలో బుధవారం వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పార్క్ చేసిన వాహనాల్లో 150 వాహనాలు దహనమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు ఫైరింజన్లను ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు రెండుగంటల పాటు నిర్విరామంగా ప్రయత్నించారు. ఇక అగ్నికి ఆహుతైన వాహనాల్లో 130 ద్విచక్రవాహనాలు,10 ఆటోలు, పది కార్లు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న శ్రీరామ్ పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఎండిన గడ్డి కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోంది.Massive fire in Bangalore. Somewhere north of BTM#Bangalore #fireaccident #Bengaluru pic.twitter.com/xEkxCRRYQt— Shashank Shekhar (@qri_us) January 29, 2025 -
Hyderabad: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం
రసూల్‌పురా: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్ బాక్సులతో డీసీఎం కంటైయినర్ బంజారాహిల్స్ వైపు వెళ్తోంది. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్లో నుంచి మద్యం సీసాల కాటన్ బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. -
దారుణం: పొగమంచుతో వందల కొలది వాహనాలు ఢీ.. ఏడుగురు మృతి
న్యూయార్క్: అమెరికా, లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. వాహనాలు ఒకదానికొకటి చొచ్చుకొచ్చి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్‌స్టేట్-55 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక విషయాలను ప్రత్యక్ష సాక్షులు ఈ విధంగా వివరించారు. రహదారి అంతా పొగమంచుతో అస్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రుల రోదనలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ కారు ఏకంగా వంతెన దాటి నీటిలో పడిపోయింది. డ్రైవర్లు రోడ్లుపైకి వచ్చి సహాయం కోరుతున్నారు. 7గురు చనిపోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రహదారిని మూసేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇదీ చదవండి: పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్ -
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే!
సాక్షి, హైదరాబాద్: మీరు వాహనం నడిపేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? కళ్లు తిరిగినట్లు అనిపిస్తోందా? కారు లేదా లారీ లేదా ఏదైనా వాహనాం నడిపేటప్పుడు ఒక పక్కకు వెళ్లినట్లు అనిపించిందా? మీకు తెలియకుండానే యాక్సిడెంట్ అయిపోయిందా? ఒక్కసారిగా స్టీరింగ్ వదిలేశారా? అయినా ఏం జరిగిందో మీకు అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటే.. మీ మెదడులోని బ్యాలెన్స్ సిస్టంలో ఏదో లోపం కారణంగానే ఇలా జరుగుతూ ఉండే అవకాశముంది. దీన్నే వైద్య పరిభాషలో మోటరిస్ట్ వెస్టిబులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్ అంటారు. రోడ్డు ప్రమాదాల్లో 50% వరకు బ్రెయిన్ బ్యాలెన్స్ సిస్టంలో సమస్యల వల్లే జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రైవింగ్ చేయాలంటే మన కళ్ల నుంచి మెదడు వరకు కోఆర్డినేషన్ వ్యవస్థ ఉంటుందని, అది సక్రమంగా పని చేయకపోతే బ్యాలెన్స్ తప్పుతుందని వైద్యులు అంటున్నారు. ఈ బ్యాలెన్స్ సమస్య వల్ల చాలా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయి. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు.. మలుపు తిరిగేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరత్రా కారణాలతో పాటు సాధారణంగా డ్రైవర్ మద్యం తాగి ఉంటాడనుకుంటాం. డ్రైవింగ్ సరిగా రాదని, తగిన అనుభవం లేదని అనుకుంటాం. కానీ ఇలా యాక్సిడెంట్ చేసిన వారిలో చాలా మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండి ఉండొచ్చునని, బ్యాలెన్స్ సిస్టంలో సమస్య ఉందని కానీ ఎవరూ అనుకోరు. డ్రైవర్లు కూడా తమకు కళ్లు తిరిగితే నీరసం అనుకుంటారు. సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇలా జరిగిందనుకుంటారు. వాంతుల ఫీలింగ్ ఉంటే గ్యా్రస్టిక్ సమస్య అనుకుంటారు. చాలామందికి తమలో బ్యాలెన్స్ సమస్య ఉందన్న సంగతే తెలియదు. మానసిక సమస్యలు ఉన్నవారు, డిప్రెషన్, భయం ఉన్న వారిలో ఇలాంటి బ్యాలెన్స్ సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవారిలో 66% మందికి అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. 58 శాతం మంది మల్టిపుల్ లేన్స్ ఉన్నప్పుడు గందరగోళానికి గురవుతారు. కళ్లు తిరుగుతుంటాయి. చదవండి : దత్తపుత్రుడికి ఆస్తి హక్కులుండవ్: హైకోర్టు 58% మందికి టర్నింగ్ (మలుపు తిరిగేటప్పుడు) సమయంలో సమస్య ఉత్పన్నమవుతుంది. 40 % మందికి ఇతర వాహనాన్ని చూసినప్పుడు కంగారు, కళ్లు తిరగడం వంటివి సంభవిస్తాయి. 25% మందికి బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నా, పల్లానికి వెళ్తున్నా కళ్లు తిరుగుతాయి. 29% మందికి ఓవర్టేక్ చేసేప్పుడు కళ్లు తిరుగుతాయి. 12 శాతం మందిలో ఇరుకైన సొరంగాల్లో వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్య ఏర్పడుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పష్టత (క్లారిటీ) ఉండాలి. దాన్నే స్పేషియల్ కాగ్నెటివ్ ఎబిలిటీ అంటారు. మన కాళ్లు, చేతుల మధ్య కోఆర్డినేషన్ అవసరం. ఇందులో మన బ్రెయిన్, కొన్ని నరాలు కూడా భాగస్వామ్యం అవుతాయి. ఆప్టిక్ నర్వ్ చూడటానికి, ఆక్యులో మోటార్ నర్వ్ కళ్లు అటూ ఇటూ తిప్పి చూడడానికి సహకరిస్తాయి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్ మన బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. ముందుకు వెళ్లాలన్నా, వెనక్కు వెళ్లాలన్నా ఇది నియంత్రిస్తుంది. స్పైనల్ యాక్సెసరీ నర్వ్ మనం మెడ అటూ ఇటూ తిప్పడాన్ని నియంత్రిస్తుంది. ఇవన్నీ కాకుండా బ్రెయిన్లో ఉన్న మోటార్ సెరిబెల్లార్ సిస్టం, ఎక్స్ట్రా పిరమిడల్ సిస్టం కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం డ్రైవ్ చేయాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేయాలి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్ మనం నడవాలన్నా, వెనక్కు ముందుకు జరగాలన్నా.. ఇలా మొత్తం బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. ఈ నరంలో సమస్య ఏర్పడితే డ్రైవింగ్ చేసేటప్పుడు సమస్యలు వస్తాయి. అలా వచ్చే సమస్యలనే మోటరిస్ట్ వెస్టిబిలో సిండ్రోమ్ అంటారు. ఇది స్కిల్డ్ డ్రైవర్లలో వచ్చే సడన్‌గా వచ్చే సమస్య. ట్రక్ డ్రైవర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. లారీ, బస్సు డ్రైవర్లలోనూ ఈ సమస్య ఉంటుంది. 79 శాతం మందిలో డిసోరియెంటేషన్ ఏర్పడుతుంది. సడన్‌గా వారు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో అర్థం కాదు. 55 శాతం మందికి కళ్లు తిరుగుతాయి. వాహనంపైనా నియంత్రణ కోల్పోతారు. 35 శాతం మందికి కారు ఒకవైపు పోతున్నట్లు అనిపిస్తుంది. 25 శాతం మందికి చెమటలు పట్టడం, కాళ్లు చేతులు చల్లగా అయిపోయి గుండె దడదడ కొట్టుకోవడం జరుగుతుంది. 25 శాతం మందికి శరీరం గట్టిగా (స్టిఫ్) అయిపోతుంది. ఇలాంటి సమస్యకు గురైన చాలామంది గుండెపోటు వచి్చందనుకొని భయపడతారు. కానీ ఈసీజీ వంటివి చేస్తే అన్నీ సాధారణంగానే ఉంటాయి. ఏం చేస్తున్నారో అర్ధం కాదు.. డ్రైవర్లకు ఎలా తోలుతున్నారు అన్నదాన్ని చూసే అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు.. కానీ వారి ఆరోగ్య పరిస్థితిని చూడరు. బ్యాలెన్స్ సిస్టంను ఎవరూ చెక్ చేయరు. అయితే మోటరిస్ట్ వెస్టిబులర్ సిండ్రోమ్‌తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడయ్యింది. మా వద్దకు ఇలాంటి వారు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. బ్యాలెన్స్ సమస్య ఉన్నవారిలో 60 శాతం మందికి మైగ్రేన్ (తలనొప్పి) సమస్య ఉన్నట్లు గుర్తించారు. 50 శాతం మందిలో వాంతి వచ్చినట్లు అవడం జరుగుతుంది. ఈ తరహా వాటన్నింటికీ చికిత్స ఉంది. న్యూరో ఆటాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పరీక్ష చేసి, పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్నింటికి మందులు ఉంటాయి. కొన్నింటికి వ్యాయామంతోనే సరిచేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30–45 వయస్సు వారిలో ఎక్కువగా ఇటువంటి సమస్యలుంటాయి. మహిళల్లోనూ ఎక్కువగా చూస్తుంటాం. – డాక్టర్ లాస్య సింధు, ఈఎన్టీ న్యూరో ఆటాలజిస్ట్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ -
వాహన 'ధీమా'
సాక్షి, అమరావతి: ఓ వాహనం ప్రమాదానికి గురై ఆ వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆ వాహనానికి చెల్లించిన ఇన్సూరెన్స్ పత్రాలను జతచేసి పరిహారం కోసం దరఖాస్తు చేస్తే.. ఆ వాహనానికి చేసిన బీమా నకిలీదని తేలింది. దాంతో బాధిత కుటుంబానికి ఎలాంటి పరిహారం లభించలేదు. వాహన బీమా నకిలీ దందా ఉచ్చులో పడి ఆ కుటుంబం మోసపోయింది. ఏటా ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 లక్షల వాహనాలకు నకిలీ బీమా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రంగంలోకి దిగిన రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీ డీఆర్ఐ), రవాణా శాఖ సంయుక్తంగా ‘వాహన బీమా మిత్ర’ అనే వెబ్ అప్లికేషన్ రూపొందించాయి. అందుకోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు చెందిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)తో ఏపీ డీఆర్ఐ ఇటీవల ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ అప్లికేషన్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. దశాబ్దాలుగా దందా రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న వాహన నకిలీ బీమా దందాపై గతేడాది ‘వాహన బీమాకు నకిలీ మకిలీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కొందరు నకిలీ ఏజెంట్లు, వాహన కాలుష్య తనిఖీ వాహనాల కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై రాష్ట్ర డీఆర్ఐ రెండు దశల్లో జరిపిన దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. 15 బీమా కంపెనీల పేరిట జారీ చేసిన 2,80,873 వాహనాల బీమా పాలసీలను పరిశీలించగా.. వాటిలో ఏకంగా 1,20,623 పాలసీలు బీమా కంపెనీల డేటాతో మ్యాచ్ కాలేదు. రెండో దశలో రాష్ట్ర రవాణా శాఖ డేటాబేస్‌లో ఉన్న 1,111 వాహన బీమా ప్రీమియంలను పరిశీలించారు. వాటిలో ఏకంగా 468 బీమా పాలసీలు నకిలీవని, మరో 80 పాలసీలు అర్హతలేని కంపెనీలవని తేలింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 1.25 కోట్ల వాహనాలకు బీమా చేస్తున్నారు. వాటిలో దాదాపు 40 లక్షల పాలసీలు నకిలీవేనని డీఆర్ఐ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 5వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నకిలీ పాలసీలు చేయించిన వారికి పరిహారం అందడం లేదు. ఇకపై నకిలీలకు తావుండదు ‘వాహన బీమా మిత్ర’ వెబ్ అప్లికేషన్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ప్రభుత్వం విస్తరిస్తోంది. ఐఐబీ తమ వద్ద ఉన్న దేశంలోని వాహన బీమా కంపెనీల డేటాబేస్‌ను ఈ అప్లికేషన్లో అందుబాటులో ఉంచుతుంది. ఏ వాహనదారుడైన తన వాహనం నంబర్, బీమా పాలసీ నంబర్లను ఆ వెబ్ అప్లికేషన్లో నమోదు చేస్తే.. వెంటనే ఆ బీమా పాలసీ అసలైనదా కాదా అన్నది తెలుసుకోవచ్చు. నకిలీ బీమా పాలసీ అని తేలితే ఆ పాలసీ చేయించిన ఏజెంట్‌పై వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో పోలీసులు ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకుంటారు. దాంతో నకిలీ బీమా పాలసీలు చేయించే ఏజెంట్ల ఆటకట్టించడం సాధ్యమవుతుంది. తాము చేయించింది నకిలీ బీమా అని నిర్ధారణ అయితే వాహనదారులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సరైన బీమా పాలసీని ఆన్లైన్ ద్వారా గానీ బీమా కంపెనీ అధికారికంగా గుర్తించిన ఏజెంట్ ద్వారా గానీ తీసుకోవచ్చు. దాంతో ఆ వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే బీమా రక్షణ లభిస్తుంది. ఈ వెబ్ అప్లికేషన్‌ను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆ గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో ఉన్న వాహనాల బీమా పాలసీలను పరిశీలించి వాటిలో నకిలీవి ఉంటే వెంటనే సదరు వాహనదారులను అప్రమత్తం చేస్తారు. డిస్కౌంట్ ఇచ్చేలా చర్చలు ‘వాహన బీమా మిత్ర’ వెబ్ అప్లికేషన్ ద్వారా వాహన బీమా చేయించుకునే సౌలభ్యం కల్పించాలని డీఆర్ఐ భావిస్తోంది. అందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆ వెబ్ అప్లికేషన్ ద్వారా పాలసీ తీసుకుంటే కొంత డిస్కౌంట్ ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తోంది. వాహన బీమా పాలసీ కాల పరిమితి ముగుస్తుందనగా ఆ వాహనదారు మొబైల్‌కు మెసేజ్ పంపి అప్రమత్తం చేస్తారు. గడువులోగా పాలసీని రెన్యువల్ చేసుకునేలా చూస్తారు. -
‘కొత్త’ ఆవిష్కర్త.. బీటెక్ చదువుతూనే..
పిఠాపురం(కాకినాడ జిల్లా): వాహనంలో వెళ్తున్నప్పుడు ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తే.. మన ప్రమేయం లేకుండానే ప్రమాదాన్ని గుర్తించి వాహనం దానంతట అదే ఆగిపోతే.. ప్రతి వాహనదారుడు ఇలాంటి పరికరాలు తన వాహనంలో ఉండాలని కోరుకుంటాడు. బీటెక్ చదువుతున్న కొత్త లోక్‌నాథ్ ఇది గుర్తించి తన మెదడుకు పదును పెట్టాడు. చిన్న వయసులోనే అద్భుత ఆవిష్కరణ చేశాడు. చదవండి: AP: ‘ఆరోగ్య’ వ్యవసాయం అదే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్. వాహనంపై రకరకాల ఆలోచనలతో వెళుతుంటే ఎదురుగా వేగంగా వాహనాన్ని గుర్తించలేక ప్రమాదం జరగొచ్చు. లేదా ఏవైనా జంతువులు అకస్మాత్తుగా అడ్డం పడొచ్చు. తప్పించుకునే లోపే ప్రమాదం ఎదురు కావచ్చు. ఇలాంటి వాటిని అధిగమించడానికి లోక్‌నాథ్.. ఓ సెన్సార్ సిస్టమ్ రూపొందించాడు. వాహనానికి అమర్చే ఈ సెన్సార్‌కు కొంత పరిధి ఉంటుంది. అందులోకి ఏదైనా వాహనం, జంతువులు, ఇతర ప్రమాదకర అంశాలు వస్తే గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్ సిస్టమ్ పని చేసి, వాహనం వేగం తగ్గిపోతుంది. ఆ తర్వాత వాహనం ఆగిపోతుంది. తద్వారా ప్రాణాపాయం తప్పుతుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన లోక్‌నాథ్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కొత్త సునీల్, సుజాత దంపతుల కుమారుడు. తండ్రి ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్. ప్రస్తుతం లోక్‌నాథ్ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీలో బీటెక్ సెకండియర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పదో తరగతిలో 10కి 10 జీపీఏ, ఇంటర్లో 90% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు తన 2 ఆవిష్కరణలకు లోక్‌నాథ్ పేటెంట్ హక్కులు సాధించాడు. సుమారు 40 పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏటా నిర్వహించే స్పెషల్ ఎడ్యుకేషన్ డేటా సిస్టం అనే కార్యక్రమంలో ఆంధ్రా నుంచి తొలిసారి ఎంపికై సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ పొందాడు. గుజరాత్ పారుల్ యూనివర్సిటీ నిర్వహించిన 48 గంటల ఆన్లైన్ కోడింగ్ కాంపిటీషన్ (హ్యాకథాన్)లో 3వ స్థానం, వెల్లూరు విట్ యూనివర్సిటీ నిర్వహించిన హ్యాకథాన్‌లో 2వ స్థానం సాధించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అభినందనలు అందుకున్నాడు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధిస్తా దేశంలోనే పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం. నా తల్లిదండ్రులు, అక్క ప్రోత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మహీంద్ర వంటి వివిధ మోటార్ వాహనాల కంపెనీల నుంచి నా ఆవిష్కరణలకు ఆహా్వనాలు అందుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, వాహన ప్రమాదాల నివారణపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాను. – కొత్త లోక్‌నాథ్, బీటెక్ విద్యార్థి, పిఠాపురం స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ లోక్‌నాథ్ మరో సాంకేతిక ఆవిష్కరణ కూడా చేశాడు. ఇంటర్నెట్లేని మారుమూల ప్రాంతాల్లో వాతావరణ మార్పులను సెల్‌ఫోన్ ద్వారా హెచ్చరించే వ్యవస్థను రూపొందించాడు. ఫోన్‌కు టెంపరేచర్, రెయిన్ సెన్సార్లు అమర్చి, ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా వాతావరణ మార్పులను ఆ వ్యవస్థ మనకు తెలియజేస్తుంది. సెల్ఫోన్లో వాతావరణ హెచ్చరికలు సాధారణంగా వస్తుంటాయి. కానీ, లోక్‌నాథ్ ఆవిష్కరణలో రెయిన్ గేజ్ కూడా ఉంది. దీని ద్వారా ఎంత వర్షం, ఎంత సమయం పడింది, పడుతుంది అనే వివరాలు కూడా తెలుస్తాయి. లోక్‌నాథ్ తయారు చేసిన స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ -
టీఆర్ఎస్ కార్యకర్తల టాటా ఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం
కరీంనగర్: హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజారాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం తరలిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. టాటా ఏస్‌లో మొత్తంగా.. 20 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే.. ట్రాలీలో ఉన్నమహిళలు రోడ్డుపై ఎగిరి పడ్డారు. ఆ ప్రదేశమంతా క్షత గాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటిపోయింది. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో .. వారికి మెరుగైన చికిత్సకోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై ఒకవైపు పూర్తిగా ధాన్యం రాసులు కుప్పగా పోయడం వలన ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
పెళ్లి చేసి తిరిగి వస్తున్న తరుణంలో..
సాక్షి, శ్రీకాకుళం : వధూవరులకు పెళ్లి చేసి వారితో ఆనందంగా తిరుగు పయనమయ్యారు. అయితే బయలుదేరిన కాసేపటికే వీరు వెళ్తున్న టాటా ఏస్ కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. గురువారం మండలంలోని అలికాం–బత్తిలి రోడ్డులో రావిచెంద్రి–కోవిలాం గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సరుబుజ్జిలి ఎస్సై కే మహలక్ష్మి, బాధితులు, స్థానికుల కథనం మేరకు... విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంపరేవళ్ల గ్రామానికి చెందిన కేశిరెడ్డి చిన్నికి హిరమండలం మండలంలోని శుభలయ కాలనీకి చెందిన గేదెల జ్యోతితో బుధవారం రాత్రి వివాహమైంది. గురువారం ఉదయం శుభలయ కాలనీ నుంచి కొత్త దంపతులతోపాటు కొయ్యూరు మండలంలోని కసివలస, మంపరేవళ్ల, పాలపాలెం గ్రామాల నుంచి వచ్చిన బంధువులు మూడు టాటా ఏసీ వ్యాన్లతో తిరుగు పయనమయ్యారు. వీరు కోవిలాం కాలనీ దాటిన తర్వాత, పొలంలో విత్తనాలు వేసేందుకు బయలుదేరిన మండలంలోని చిన్నకొల్లి్లవలస గ్రామానికి చెందిన వంశధార నిర్వాసిత రైతు బూడిద గణపతి తన చిన్నమోపెడ్ (ద్విచక్ర) వాహనంతో రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. ఎటువైపు వెళ్లాలో తెలియక తికమకపడుతూ పెళ్లి వాహనానికి అడ్డంగా వచ్చేశాడు. ద్విచక్ర వాహనం తప్పించే క్రమంలో పెళ్లి వ్యాన్ రైతును ఢీకొని రోడ్డు పక్కన సాగునీటి కాలువలోకి బోల్తా కొట్టింది. అదే వ్యాన్‌లో కొత్త దంపతులతోపాటు మరో ఎనిమిది మంది బంధువులు ఉన్నారు. అయితే కాలువలో కొద్దిగా నీరు, బురద ఉండటంతో వారికి పెద్ద ప్రమాదమే తప్పింది. అనపరెడ్డి అప్పారావుతోపాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. రైతు బూడద గణపతి రోడ్డుపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. ఈయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని సరుబుజ్జిలి ఎస్సై కే మహలక్ష్మి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
విందుకు వెళ్తుండగా ప్రమాదం
నిజాంసాగర్/పిట్లం(జుక్కల్): పెళ్లి విందుకు వెళ్తుం డగా వాహనం బోల్తాపడి 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిట్లం మండల కేంద్రానికి చెందిన యువకుడికి, కంగ్టి మం డలం తడ్కల్‌కు చెందిన యువతితో బుధవారం పెళ్లి జరిగింది. వరుడి ఇంటివద్ద ఏర్పాటు చేసిన విందుకు వధువు తరఫు బంధువులు బొలెరో వాహనం లో బయల్దేరారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. వీరిలో స్వరూప, నర్సింహులు, నర్సవ్వ, జ్యోతి, అరుణ, నాగరాణి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఇక్కడ వైద్యులు లేరు. అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
చిన్నారిని చిదిమేసిన గుర్తుతెలియని వాహనం
హస్తినాపురం:ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన మేరకు..కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్ గ్రామానికి చెందిన తుకారం తన భార్య సబిత, కూతురు శ్రేష్ట తో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినాధ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తుకారాంఏకైక కూతురు శ్రేష్ట (16నెలలు) గురువారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలు కావడంతో చిన్నారిని చికిత్స నిమిత్తం చింతలకుంటలో గల రెయింబో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చిన్నారి శ్రేష్ట మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి తుకారాం íఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చుట్టుప్రక్కల కాలనీలతోపాటు విజయవాడ జాతీయరహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఆవాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. -
వాహన పూజలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం
సాక్షి, వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వాహన పూజలో అపశృతి దొర్లింది. రాజన్న ఆలయం ముందు వాహన పూజ చేస్తుండగా నిలిపి ఉంచిన బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు దూకి క్యూలైన్లోకి దూసుకెళ్లింది. దర్శనం కోసం వేచి ఉన్న ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ మియాపూర్‌కు చెందిన లక్ష్మి, నరసింహస్వామి దంపతులు గాయపడగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆలయ అధికారులు పరామర్శించారు. -
విహారంలో విషాదం
అనంతగిరి, శృంగవరపుకోట/నరసన్నపేట: నవ్వుతూ తుళ్లుతూ కేరింతలతో గడిపిన పర్యాటకులు అంతలోనే ప్రమాదంలో చిక్కుకున్నారు. అదుపు తప్పి లోయలో పడాల్సిన వాహనం అదృష్టవశాత్తూ చెట్టును ఢీకొని ఆగడంతో ఘోర ప్రమాదం తప్పింది. వాహనంలో 21మంది ఉండగా.. వారిలో ఎనిమిదిమంది పర్యాటకులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలకు చెందిన 21 మంది బుధవారం ఉదయం అరకు చేరుకుని సాయంత్రం వరకూ అక్కడి అందాలు తిలకించారు. రాత్రి 7 గంటల సమయంలో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో అనంతగిరి మండలం త్యాడ సమీపంలోని 4వ మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న వింగర్ వాహనం బ్రేక్ ఫెయిలైంది. వాహనాన్ని నియంత్రించేందుకు మరో అవకాశం లేకపోవడంతో డ్రైవర్ వాహనాన్ని చెట్టును ఢీకొట్టి ఆపారు. లేకుంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని సమాచారం. అదే సమయంలో కాశీపట్నంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనంతగిరి నుంచి వస్తూ ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి ఎస్.కోట సీహెచ్‌సీకి సమాచారం అందించారు. వెంటనే వైద్యసిబ్బంది చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గుర్ని విజయనగరం కేంద్రాస్పత్రికి, ఐదుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ఎల్.దేవి, ఐ.సరస్వతి, కె.తవిటినాయుడు, ఎల్.రాజు, కె.ప్రసాద్‌రావు, ఎం.సరస్వతి, సత్యవతి, భాగ్యలక్ష్మి, లత తదితరులు ఉన్నారు. -
పినపాక ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం
► ట్రాలీ ఆటో, ఎమ్మెల్యే వాహనం ఢీ ► స్వల్పగాయాలతో బయటపడ్డ పాయం బూర్గంపాడు(పినపాక): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం త్రుటిలో ప్రాణాపా యం నుంచి తప్పించుకున్నారు. సింగరేణి ఎన్నికలపై హైదరాబా ద్లో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు పాయం ఉదయం ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ వద్ద ఎదురుగా ఉల్లిపాయల లోడ్‌తో వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొంది. దీంతో ఎమ్మెల్యే వాహనం రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 వాహనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇన్నోవాలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే, డ్రైవర్, గన్‌మన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాలీ డ్రైవర్‌కు, అందులో ఉన్న మరొకరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మోరంపల్లి బంజారా పీహెచ్‌సీకి తరలించారు. వెంకటే శ్వర్లు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతోనే తాను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. -
ఆవుల తరలింపు గుట్టురట్టు
ప్రమాదానికి గురైన వాహనం అపస్మారక స్థితిలో డ్రైవర్.. ఇద్దరు పరారీ కంటైనర్‌నుంచి వంద ఆవులను వెలికితీసిన స్థానికులు ఆలమూరు : అక్రమంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్న విషయం ఓ రోడ్డు ప్రమాదంతో బయటపడింది. స్థానికుల కథనం ప్రకారం పదహారో నంబరు జాతీయ రహదారిలోని జొన్నాడ జంక్షన్ వద్ద ఒడిశా నుంచి తమిళనాడు వెళుతున్న కంటైనర్ మచిలీపట్నం నుంచి మండపేట వస్తున్న లారీని శనివారం ఢీకొట్టింది. దాంతో కంటైనర్ క్యాబిన్లో ప్రయాణిస్తున్న ముగ్గురిలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. మిగిలిన ఇద్దరూ పరారయ్యారు. అది స్థానికుల్లో అనుమానాలను రేకేత్తించింది. ఈ అనుమానమే బారీ స్థాయిలో గోవుల తరలింపును గుట్టురట్టు చేసింది. రహదారికి అడ్డంగా ఉందని ఆలమూరు పోలీసులు కంటైనర్‌ను క్రేన్ సాయంతో పక్కకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా అనిపించింది. దాంతో పోలీసులు కంటైనర్ వెనుక భాగాన్ని తెరచి చూడగా భయంకరమైన పరిస్థితుల్లో గోవులు కంటబడ్డాయి. ద్విచక్రవాహనాలు తరలించే అకంటైనర్ రెండు అరల్లో సుమారు 100 ఆవులను కుక్కేశారు. పైభాగంలో ఉన్న గోవులను కాళ్లు విరిచి కదలడానికి వీలు లేకుండా కట్టిపడేశారు. స్థానిక యువకులు ఆగోవులన్నింటిని తీవ్ర ప్రయాసలకోర్చి బయటకు తీశారు. వాటిలో రెండు గోవులు మృతి చెందగా మరో ఐదు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని స్వీకరించేందుకు గో సంరక్షణ సమితి నిరాకరించడంతో స్థానిక పోలీసులు పెంచుకునేందుకు ఆసక్తి కనబర్చిన రైతులకు ఆగోవులను అప్పగించారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న కంటైనర్ డ్రైవర్‌ను ఎన్‌హెచ్ 16 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకుంటే కాని నిందితుల ఆచూకీ లభించని పరిస్థితి ఏర్పడింది. ఈమేరకు ఆలమూరు ఎస్సై ఎం.శేఖర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవుల తరలింపుపై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో గోవుల తరలింపుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కొత్తపేట నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి టి.రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. అక్రమార్కులు గోవులను లారీల్లో కాకుండా కంటైనర్లలో తరలించడాన్ని బట్టి ఈవ్యాపారం ఏస్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా దళాన్ని నియమించాలని సూచించారు. గాయపడ్డ గోవులకు సకాలంలో వైద్యం అందలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు. -
విప్ ఓదేలు వాహనానికి ప్రమాదం
గేదెలను తప్పించబోయి ఢీకొన్న కాన్వాయ్... త్రుటిలో తప్పిన ముప్పు అడ్డాకుల: ప్రభుత్వ విప్, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు వాహనం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూర్ స్టేజీ వద్ద స్వల్ప ప్రమాదానికి గురైంది. ఓదేలుకు చెందిన మూడు వాహనాలు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టుకోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. విప్ ఓదేలుతో సహా మూడు వాహనాల్లో ఉన్న వారెవరూ గాయపడలేదు. కర్నూలు జిల్లాలో గురువారం ఓ వివాహానికి హాజరైన ఓదేలు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కందూర్ స్టేజీ వద్ద రోడ్డుపైకి సడన్‌గా గేదెలు రావడంతో ముందు వెళ్తున్న ఓదేలు ఫార్చునర్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక ఉన్న వాహనాలు ఢీకొన్నాయి. అడ్డాకుల ఎస్ఐ కె.శ్రీనివాస్ వాహనాలను రోడ్డు పక్కకు తీయించారు. మరో వాహనంలో విప్ ఓదేలు హైదరాబాద్‌కు బయలుదేరారు. -
ఆటో, టవేరా ఢీకొని ఇద్దరి మృతి
♦ పోలీస్‌స్టేషన్ పక్కనే ప్రమాదం ♦ మృతుల్లో ఒకరు ఏఎన్ఎం, మరొకరు సింగిల్‌విండో సీఈఓ గోవిందరావుపేట : ఆటో, టవేరా వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పస్రా పోలీస్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లాకు చెందిన కొత్తోడ గ్రామానికి చెందిన వ్యక్తులు తాము వేసుకున్న ఆంజనేయ మాల విరమణ చేసుకునేందుకు భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయూణంలో వారు ప్రయూణిస్తున్న టవేరా వాహనం గోవిందరావుపేట నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను పస్రా పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయూణిస్తున్న గోవిందరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న సామర్తపు వెంకటలక్ష్మి(48) అక్కడికక్కడే మృతి చెందింది. గాయూలపాలైన నలుగురిని 108లో ములుగుకు తరలించగా, అక్క డ గోవిందరావుపేట సింగిల్‌విండోలో సీఈఓగా పనిచేస్తున్న గుంటి రాజయ్య(50) మృతిచెందాడు. కాగా మృతురా లు వెంకటలక్ష్మి గోవిందరావుపేట పీహెచ్సీలో ఐదేళ్లుగా పనిచేస్తోంది. మరో మృతుడు రాజయ్య మూడు నెల ల క్రితమే ములుగు కోఆపరేటివ్ బ్యాం కు నుంచి గోవిందరావుపేట సింగిల్‌విండోకు బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే సింగిల్‌విండోను మంచిగా తీర్చిదిద్దుతున్న ఆయన ఇలా అకస్మాత్తుగా మరణించడం తమకు తీరని లోటని సింగిల్‌విండో అధ్యక్షుడు సోలిపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. పస్రాలోని కొంతమంది రైతులకు రుణమాఫీ పత్రాలు అందలేదని చెప్పడంతో వారికి వాటిని అందించేందుకు ఆయన పస్రాకు వస్తున్నారని తెలిపారు. -
స్వల్పగాయాలతో బయటపడ్డ నవదంపతులు