
పినపాక ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం
► ట్రాలీ ఆటో, ఎమ్మెల్యే వాహనం ఢీ
► స్వల్పగాయాలతో బయటపడ్డ పాయం
బూర్గంపాడు(పినపాక): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం త్రుటిలో ప్రాణాపా యం నుంచి తప్పించుకున్నారు. సింగరేణి ఎన్నికలపై హైదరాబా ద్‌లో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు పాయం ఉదయం ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ వద్ద ఎదురుగా ఉల్లిపాయల లోడ్‌తో వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొంది.
దీంతో ఎమ్మెల్యే వాహనం రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 వాహనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇన్నోవాలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే, డ్రైవర్, గన్‌మన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాలీ డ్రైవర్‌కు, అందులో ఉన్న మరొకరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మోరంపల్లి బంజారా పీహెచ్‌సీకి తరలించారు. వెంకటే శ్వర్లు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతోనే తాను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని అన్నారు.