
నిజాంసాగర్/పిట్లం(జుక్కల్): పెళ్లి విందుకు వెళ్తుం డగా వాహనం బోల్తాపడి 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిట్లం మండల కేంద్రానికి చెందిన యువకుడికి, కంగ్టి మం డలం తడ్కల్‌కు చెందిన యువతితో బుధవారం పెళ్లి జరిగింది.
వరుడి ఇంటివద్ద ఏర్పాటు చేసిన విందుకు వధువు తరఫు బంధువులు బొలెరో వాహనం లో బయల్దేరారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. వీరిలో స్వరూప, నర్సింహులు, నర్సవ్వ, జ్యోతి, అరుణ, నాగరాణి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఇక్కడ వైద్యులు లేరు. అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.