♦ పోలీస్‌స్టేషన్ పక్కనే ప్రమాదం
♦ మృతుల్లో ఒకరు ఏఎన్‌ఎం, మరొకరు సింగిల్‌విండో సీఈఓ
గోవిందరావుపేట : ఆటో, టవేరా వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పస్రా పోలీస్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లాకు చెందిన కొత్తోడ గ్రామానికి చెందిన వ్యక్తులు తాము వేసుకున్న ఆంజనేయ మాల విరమణ చేసుకునేందుకు భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయూణంలో వారు ప్రయూణిస్తున్న టవేరా వాహనం గోవిందరావుపేట నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను పస్రా పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఢీకొంది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయూణిస్తున్న గోవిందరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సామర్తపు వెంకటలక్ష్మి(48) అక్కడికక్కడే మృతి చెందింది. గాయూలపాలైన నలుగురిని 108లో ములుగుకు తరలించగా, అక్క డ గోవిందరావుపేట సింగిల్‌విండోలో సీఈఓగా పనిచేస్తున్న గుంటి రాజయ్య(50) మృతిచెందాడు. కాగా మృతురా లు వెంకటలక్ష్మి గోవిందరావుపేట పీహెచ్‌సీలో ఐదేళ్లుగా పనిచేస్తోంది.
మరో మృతుడు రాజయ్య మూడు నెల ల క్రితమే ములుగు కోఆపరేటివ్ బ్యాం కు నుంచి గోవిందరావుపేట సింగిల్‌విండోకు బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే సింగిల్‌విండోను మంచిగా తీర్చిదిద్దుతున్న ఆయన ఇలా అకస్మాత్తుగా మరణించడం తమకు తీరని లోటని సింగిల్‌విండో అధ్యక్షుడు సోలిపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. పస్రాలోని కొంతమంది రైతులకు రుణమాఫీ పత్రాలు అందలేదని చెప్పడంతో వారికి వాటిని అందించేందుకు ఆయన పస్రాకు వస్తున్నారని తెలిపారు.
ఆటో, టవేరా ఢీకొని ఇద్దరి మృతి
Published Sat, Apr 4 2015 1:58 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement
Advertisement