స్వల్పగాయాలతో బయటపడ్డ నవదంపతులు | Newly married couple injured in vehicle accident | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 11 2013 8:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

వేద మంత్రాలు... బంధువుల సాక్షిగా.. మూడు ముళ్లు... ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు. పెళ్లిమండపం నుంచి అత్తగారింటికి బయలుదేరారు. అంతలో అనుకోని ఘటన జరిగింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. బోల్తా కొట్టింది. అదృష్టం బాగుండి నవ దంపతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కరీంనగర్‌ జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేటలో జరిగింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుత్తూరు తిరుమల డైరీ సమీపంలో లారీని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందగా ఆటో ప్రయాణిస్తున్న మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో నుజ్జునుజ్టు అవ్వగా ఆటోలో తరలిస్తున్న బియ్యం చెల్లాచెదురైంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement