q lines
-
ట్రస్ట్ నిర్వాహకులకు పూర్తి సహకారం అందిస్తామన్న టీటీడీ ఛైర్మన్
-
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
క్యూలో నిలబడినా, నిద్రపోయినా.. ఆఖరికి ఏడ్చినా జీతమిస్తారు..!
పని చేస్తే జీతమిస్తారు ఎక్కడైనా. కానీ.. పరుపులపై నిద్రపోవడం.. క్యూలైన్లో నిలబడటం.. శవం దగ్గర ఏడ్వటం లాంటి పనులు చేస్తే కాసుల వర్షం కురుస్తోంది. వివిధ దేశాల్లో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులెన్నో చేసేస్తూ డబ్బులు గడిస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. అవేంటో చూసేద్దాం పదండి. కార్యాలయం లేదా పనిచేసే చోట నిద్రపోతే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ.. బాగా నిద్రపోయే వారికి మాత్రం అక్కడ జీతాలు ఇస్తారు. ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ పేరిట ఇలాంటి ఉద్యోగాలను పరుపుల తయారీ కంపెనీలు, కొన్ని ప్రముఖ హోటళ్లు సైతం ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్లాండ్లోని ఒక హోటల్ ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంది. ఆ హోటల్లోని బెడ్లలో రోజూ ఏదో ఒక బెడ్‌పై పడుకుని అవి సౌకర్యంగా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసి నివేదిక ఇవ్వడమే ప్రొఫెషనల్ స్లీపర్ పని. ఇందుకోసం వీరికి నెలకు రూ.లక్షల్లో జీతాలిస్తున్నారు. అంతేకాదు.. బెడ్లు, పరుపుల తయారీ కంపెనీలు సైతం వాటి నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంటున్నాయి. న్యూయార్క్‌లో పరుపులు తయారు చేసే కాస్పెర్ కంపెనీ బిజినెస్ పెంచుకునేందుకు కొత్తగా ఆలోచించి ‘స్లీపర్స్’ కావాలని ఈ మధ్యే ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీ పరుపు మీద పడుకుంటే కంటినిండా నిద్రపడుతుందని చెప్పడం ద్వారా మార్కెట్ పెంచుకునేందుకు ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ కోసం వెతుకుతోంది ఆ కంపెనీ. అభ్యర్థులకు ఎక్కువసేపు నిద్రపోవాలనే కోరిక ఉండాలట. చుట్టూ ఏం జరిగినా ఏమీ పట్టనట్టు హాయిగా పడుకోగలగటం ప్రత్యేకత. జాబ్‌లో చేరిన వారు కాస్పెర్ పరుపుల పైపడుకుని బాగా నిద్రపోవడంతోపాటు వారి అనుభవాలను టిక్‌టాక్ వీడియోలు, రీల్స్, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని ఆ కంపెనీ నిబంధనలు విధించింది. బెంగళూరులోనూ ఉందో కంపెనీ నిద్రపోతే చాలు జీతమిస్తామంటోంది మన దేశంలోని బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్’ సంస్థ. ‘రోజూ రాత్రి 9 గంటలపాటు శుభ్రంగా పడుకోండి. నెలకు రూ.లక్ష జీతం ఇస్తాం’ అంటోంది. అంతేకాదు.. ఈ జాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే అభ్యర్థులకు బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, ఫిట్నెస్ నిపుణులు పలు సూచనలు కూడా ఇస్తారట. అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి వారందరూ గాఢంగా, ఎక్కువ సేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు. ఇందులో పాల్గొనే వారికి ఏదైనా డిగ్రీ ఉండాలి. బెడ్‌పైకి వెళ్లగానే 10–20 నిమిషాల్లో నిద్రలోకి జారుకునే లక్షణం కలిగి ఉండాలి. క్యూలో నిలబడితే డబ్బిస్తారు క్యూలో గంటల తరబడి నిలబడటం ఎవరికైనా ఇబ్బందే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయసు పైబడిన వారు, చిన్న పిల్లల తల్లులు, పిల్లలు క్యూలైన్లో నిలబడటం కష్టం. ఇందుకు ప్రత్యామ్నాయంగా అనేక దేశాలు ‘లైన్ స్టాండర్’ పద్ధతిని అనుసరిస్తున్నాయి. లైన్లో మీరు నిలబడలేకపోతే మీకు బదులుగా అక్కడి ఉద్యోగులు నిల్చుంటారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఈ తరహా లైన్ స్టాండర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లో ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు.. మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ విడుదలైనప్పుడు వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రయాణికుల్ని తోసేస్తే జీతం పండగలు, పర్వదినాల్లో కిక్కిరిసిన రైలు, బస్సుల్లో జనం గుమ్మాల దగ్గర వేలాడటం చూస్తుంటాం. మెట్రో రైలులో ఇలాంటి పరిస్థితి వస్తే తలుపులు మూసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాల్లో ప్రత్యేకంగా ‘పాసింజర్ పుషర్స్’ను నియమిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోతోపాటు వివిధ దేశాల్లోని మెట్రో రైళ్లలో ‘పాసింజర్ పుషర్స్’ డ్యూటీలో చేరుతున్నారు. మెట్రో రైలు లోపలికి ప్రయాణికులను నెట్టేసి రైలు తలుపులు మూసుకునేలా చేయడమే వీరి పని. ఇందుకోసం వారికి నెలకు మన కరెన్సీలో చూస్తే రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు జీతం ఇస్తున్నారు. అక్కడ ఏడిస్తే డబ్బులిస్తారు కొన్ని దేశాల్లో ఎవరైనా చనిపోతే ఏడ్చేందుకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవచ్చు. చైనా, ఆఫ్రికా, యూకే వంటి దేశాల్లో మతపరమైన సంప్రదాయంలో ప్రత్యేకంగా దుఃఖితులను నియమించుకుని డబ్బులిస్తారు. వీరంతా ఏడవడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తారు. ఇందుకోసం ఒక్కో ఈవెంట్‌కు సుమారు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తారు. మరిన్ని చిత్రమైన కొలువులున్నాయ్! ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా మూవీ వాచర్లను నియమించుకుంటున్నాయి. సినిమా ప్రసారం కావడానికి ముందే సినిమా ఎలా ఉంది.. రీచింగ్ బాగా ఉంటుందా.. లేదా.. ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనే దానిపై కొందర్ని నియమించుకుని జీతాలిస్తున్నాయి. విడుదలకు ముందే వెబ్ సిరీస్, మూవీలను చూసి సమీక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే రిలీజ్ ఆధారపడి ఉంటుంది. కాగా, ఇంటికి వేసిన రంగు (కలర్) ఎంత సమయంలో ఆరుతుందో చెప్పడానికి ప్రత్యేకంగా రంగుల తయారీ కంపెనీలు పెయింట్ డ్రైయింగ్ వాచర్ పేరిట సిబ్బందిని నియమించుకుంటున్నాయి. పెయింట్ ఎంతసేపట్లో ఆరుతుంది.. చేతికి అంటుకుంటుందా అనే వివరాలతో రిపోర్ట్ తయారు చేసి మేనేజర్లకు ఇవ్వడమే వీరి పని. కాగా.. గోల్ఫ్ గేమ్‌లో కొట్టిన బంతిని దూరం నుంచి తిరిగి తేవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఆదా చేసేలా బాల్ డ్రైవర్‌ను నియమించుకుని జీతాలిస్తారు. కాగా, చివరకు కండోమ్ తయారీ సంస్థలు వాటిని మార్కెట్లో విడుదల చేయడానికి ముందు సౌకర్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా కండోమ్ టెస్టర్స్ను నియమించుకుంటాయి. వారికి జీతం ఏడాదికి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే.. ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. -
వర్షం ఎఫెక్ట్.. యాదాద్రి భక్తులకు చేదు అనుభవం
సాక్షి, యాదాద్రి భువనగిరి: అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. కాగా, చిన్నపాటి వర్షానికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్యూలైన్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం కురిసిన చిన్నపాటి వర్షానికే యాదాద్రిలో రోడ్లు కుంగిపోయాయి. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు, అధికారుల పనితనంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం -
ఇది సినిమా టికెట్ల క్యూ లైన్ కాదు..
ఇక్కడ చూస్తున్నవారంత సినిమా టికెట్ల కోసం లైన్ లో ఉన్నవారు కాదు..ప్రభుత్వ పరిహారం కోసం క్యూ కట్టిన వారు కాదు..వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి టోకెన్లు తీసుకోవడం కోసం బారులు తీరిన రైతులు..సూర్యాపేట జిల్లా పాలకీడు మండల వ్యవసాయ కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే వందలాది రైతులు టోకెన్ల కోసం ఇలా క్యూ లైన్ కట్టారు సాక్షి, మిర్యాలగూడ : ఈ ఏడాది వానాకాలం సీజన్లో సన్నధాన్యం సాగు రైతుల కొంప ముంచింది. ఒకవైపు దిగుబడి తగ్గి, మరోవైపు మద్దతు ధర లభించక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం టోకెన్ విధానం అమలు చేస్తుండడంతో వరి కోయడానికి కూడా టోకెన్ల తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో టోకెన్ల కోసం రోజూ రైతులు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు. కష్టనష్టాల కోర్చి పంట పండించి చేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. దాంతో ఈ ప్రాంతంలో 90 శాతం రైతులు సన్నధాన్యం రకాలైన పూజ, పూజా గోల్డ్, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ సాగుచేశారు. కాగా రైతులు సాగు చేసిన సన్నధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. దాంతో రైతులు మిల్లుల వద్ద విక్రయించుకునే పరిస్థితి వచ్చింది. చదవండి: గిన్నిస్ రికార్డ్ సాధించిన ఉత్తరాఖండ్ రైతు లభించని మద్దతు ధర.. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల సన్న రకాలకు అధికంగా తెగుళ్లు సోకాయి. దాంతో పెట్టుబడి పెరిగింది. అంతే కాకుండా వరి కోసే ముందు కూడా వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాంతో పంట దిగుబడి భారీగా తగ్గింది. సాధారణంగా సన్నరకం వరి సాగుకు ఎకరానికి 30 బస్తాల నుంచి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 25 బస్తాలే వస్తోంది. ఈ ధాన్యానికి మద్దతు ధర లభించే పరిస్థితులు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రేడ్ –1 రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,888 చెల్లించాల్సి ఉండగా మిల్లర్లు క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,750 వరకే చెల్లిస్తున్నారు. దాంతో ఈ ఏడాది సన్నరకం సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తే ఐకేపీ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాకు రూ.1,888 లభించడంతో పాటు దిగుబడి కూడా ఎకరానికి 30 బస్తాలు వచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఈ ఏడాది నష్టం వాటిల్లింది. టోకెన్ల కోసం పడిగాపులు.. సన్నరకం ధాన్యం విక్రయించుకోవడానికి అధికారులు జారీ చేస్తున్న టోకెన్ల కోసం రైతులు ఆయా మండల కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. టోకెన్ తీసుకున్న తర్వాతనే వరి కోసి మిల్లుకు ధాన్యం తీసుకురావాలని నిబంధనలు ఉన్నందున రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 10వ తేదీన 11, 12, 13వ తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడంతో గురువారం టోకెన్లు జారీ చేయడం లేదని మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. అయినా రైతులు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ల కోసం రైతులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు ఖమ్మం రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఉదయం 9 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రైతులు టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. కాగా పోలీసులు రైతులకు నచ్చచెప్పి రాస్తారోకో విరమింపజేశారు. రైతుల రాస్తారోకో వేములపల్లి : ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముకునేందుకు అధికారులు టోకెన్లు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆగ్రహించిన రైతులు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గల నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. గురువారం ఉదయం టోకెన్లు పొందేందుకు రైతులు ఎంపీడీఓ కార్యాలయం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అధికారులు మాత్రం టోకెన్లను 13వ తేదీ వరకు జారీ చేసేది లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే అకాల వర్షాలకుతోడు తెగుళ్లు సోకి పంట నష్టపోయామన్నారు. పండిన కొద్దోగొప్పో ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేద వ్యక్తం చేశారు. మిర్యాలగూడ సమీపంలో మార్కెట్‌యార్డు ఉన్నప్పటికీ సన్నరకం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర పొందలేక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు ఇస్తామన్న అధికారులు ఒక్కరోజు మాత్రమే 150వరకు జారీ చేశారని.. ఇప్పుడు మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గి రోజుకు 50 టోకెన్లను మాత్రమే ఇస్తామనడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులు రాస్తారోకో చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధీర్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులకు టోకెన్లు అందేలా చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా.. రైతులు ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముకునేందుకుగాను అవసరమైన మేర టోకెన్లు అందించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఏఓ రుషేంద్రమణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జవ్వాజి సత్యనారాయణ, దామోదర్‌రెడ్డి, పెదమాం వెంకన్న, సోమయ్య, సందీప్, భరత్, నవీన్‌రెడ్డి, రవి, హరికృష్ణ, ఏర్పుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. టోకెన్ల కోసం రైతులు తొందరపడొద్దు : కలెక్టర్ నల్లగొండ : సన్నరకం ధాన్యం అమ్ముకునే విషయంలో టోకెన్ల కోసం రైతులు తొందరపడొద్దని ప్రతి రైతుకూ టోకెన్లు అందజేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టోకెన్ల జారీకి పరిమితి లేదని, వచ్చే రెండు నెలల వరకు రైతులకు వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్థ్యాన్ని బట్టి రోజూ టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేసారి టోకె న్లు ఇవ్వడం సాధ్యంకాదని, టోకెన్ పొందాక రైతులు వరి కోసి ధాన్యం మిల్లుకు తరలించాలని సూచించారు. రైతులు తొందరపడి రావడం వల్ల రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య తీరుతుందని పేర్కొన్నారు. -
వాహన పూజలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం
సాక్షి, వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వాహన పూజలో అపశృతి దొర్లింది. రాజన్న ఆలయం ముందు వాహన పూజ చేస్తుండగా నిలిపి ఉంచిన బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు దూకి క్యూలైన్లోకి దూసుకెళ్లింది. దర్శనం కోసం వేచి ఉన్న ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ మియాపూర్‌కు చెందిన లక్ష్మి, నరసింహస్వామి దంపతులు గాయపడగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆలయ అధికారులు పరామర్శించారు. -
క్యూలైన్లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం
-
క్యూలైన్లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుగు ప్రయాణంలో బస్సులు చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ద్వాదశిని పురస్కరించుకుని శనివారం కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో నారాయణగిరి వనంలోని షెడ్లలోనూ వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఈరోజు అర్ధరాత్రి వరకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. శనివారంనాటి భక్తులకు రేపు దర్శనభాగ్యం ఉంటుంది. కాగా, తిరుమలలో గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల కొరతతో భక్తులకు అవస్థలు తప్పడంలేదు. బస్సు రాగానే ఎవరికివారు బస్సులో చోటు కోసం పరుగులు తీస్తున్నారు. . ... -
జనావేధన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు.. చిల్లర నోట్లు, కొత్త నోట్లు తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట జనం పెద్దఎత్తున క్యూ కడుతూనే ఉన్నారు. అడుగడుగునా అవస్థలతో వేదనకు గురవుతుంటే.. మరోవైపు వారిని మోసం చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి. కొయ్యలగూడెం మండలం కె.కన్నాపురంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద ఓ వృద్ధుణ్ణి మోసం చేసి రూ.49 వేల పాత నోట్లను దొంగలు అపహరించుకుపోయారు. ఆ గ్రామానికి చెందిన విజయరాజు అనే వృద్ధుడు తన వద్ద ఉన్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. బల్లమీద కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు మీ వస్తువులు పడిపోయాయని చెప్పి అతని వద్ద ఉన్న నోట్లను దొంగిలించి పారిపోయారు. మరోవైపు ఒకరి ఆధార్ కార్డు నంబర్‌ను ఉపయోగించి వేరేవారు డబ్బులు మార్చుకుపోయిన ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లి రూ.4వేల పాత నోట్లను మార్చుకునేం దుకు ప్రయత్నించగా ఇప్పటికే మీ ఆధార్ నంబర్‌తో సొమ్ములు మార్చుకున్నారన్న సమాధానం రావడంతో విస్తుపోయిన ఘటనలు ఏలూరులో చోటుచేసుకున్నాయి. జిరాక్స్ తీయిస్తున్న సమయంలో మరో కాపీ తీసుకున్నారా, లేకపోతే సిమ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన జిరాక్స్ కాపీలను దుర్వినియోగం చేస్తున్నారో తెలియని పరిస్థితి పలుచోట్ల ఉంది. తెరుచుకోని ఏటీఎంలు మరోవైపు శుక్రవారం కూడా ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ప్రాంగణాల్లో ఉన్న ఏటీఎంలు మాత్రం కొద్దిసేపు పనిచేయగా, బహిరంగ ప్రాంతాల్లోని ఏటీఎంలు పూర్తిగా మూసి ఉంచారు. అక్కడక్కడా కొన్ని ఏటీఎంలు తెరుచుకున్నా తక్కువ మొత్తంలో రూ.100 నోట్లు మాత్రమే పెట్టారు. రూ.2 వేల నోట్లు ఏటీఎంలలో పెట్టడానికి సాంకేతిక సమస్య ఉందని, దానిని సరిచేస్తేగాని వాటిని ఏటీఎం సెంటర్లలో అందుబాటులో ఉంచలేమని అధికారులు ప్రకటించారు. రూ.2000 నోట్లు, రూ.50 నోట్లు పెట్టాలంటే సాఫ్ట్వేర్ మార్చాల్సి ఉంటుందని, అందువల్ల జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. మరోవైపు ఏలూరు పెద్ద పోస్టాఫీసు వద్ద రూ.500, రూ.1000 నోట్లు చిల్లర ఉన్నా మార్చుకోవడం లేదంటూ ప్రజలు ధర్నాకు దిగారు. చిల్లర సమస్యతో పెట్రోల్ బంక్‌లు శనివారం నుంచి మూసివేయనున్నట్టు ప్రచారం జరగడంతో వాటివద్ద రద్దీ పెరిగింది. రూ.లక్ష విసిరేసి వెళ్లిన వ్యక్తి ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్ష విలువైన పాత వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. అవి నిజమైన నోట్లా.. కాదా.. అన్న సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. ఇదిలావుంటే మొదటి రోజు కంటే రెండో రోజున బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద జనం రద్దీ పెరిగింది. బారులు తీరి నగదు బదిలీ కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఎంతో కొంత పెద్ద నోట్లను వదిలించుకోవడమే చాలన్నట్టుగా పేద, మధ్యతరగతి వర్గాలు ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులకు పెద్ద నోట్లను చెల్లించారు.