సాక్షి, యాదాద్రి భువనగిరి: అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. కాగా, చిన్నపాటి వర్షానికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్యూలైన్‌లోకి వర్షపు నీరు చేరింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం కురిసిన చిన్నపాటి వర్షానికే యాదాద్రిలో రోడ్లు కుంగిపోయాయి. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు, అధికారుల పనితనంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment