కోడెమొక్కు చెల్లించుకున్న ముస్లిం మహిళ | Muslim Woman Gifted Bull To Vemulawada Rajanna | Sakshi
Sakshi News home page

కోడెమొక్కు చెల్లించుకున్న ముస్లిం మహిళ

Published Wed, Jan 27 2021 10:34 AM | Last Updated on Wed, Jan 27 2021 10:35 AM

Muslim Woman Gifted Bull To Vemulawada Rajanna - Sakshi

వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన అప్సర్‌ షాహిన అనే ముస్లిం మహిళ మంగళవారం కోడె మొక్కు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రంలో హిందూ ఆలయాలతోపాటు దర్గా కూడా ఉంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ దర్శనాలు జరుగుతాయి. రాజన్నను దర్శించుకున్న వారు దర్గాను, దర్గాను దర్శించుకున్న వారు రాజన్నను దర్శించుకుంటుంటారు. ఇందులో భాగంగానే అప్సర్‌ షాహిన కోడెమొక్కు చెల్లించుకుని మతసామరస్యాన్ని ప్రదర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement