Woman Stop Thief From Attack At Vemulawada In Dark; Video Viral - Sakshi
Sakshi News home page

Woman Fights Armed Robber Bravely Video: ఈ తల్లి ధైర్యానికి సెల్యూట్‌.. దొంగతో తలపడి ఉరికించింది

Published Mon, Aug 14 2023 6:19 PM | Last Updated on Mon, Aug 14 2023 8:37 PM

Video Viral: Woman Stop Thief From Attack At Vemulawada In Dark - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా వేములవాడలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఆమెపై దొంగ దాడి చేస్తున్నా భయంతో బెదరకుండా అతడితో పోరాడింది. వివరాలు.. భగవంతరావు నగర్‌లో పిల్లి శ్రీలత అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కాగా మొదటి అమ్మాయికి వివాహం జరిగింది. రెండో కూతురు అమెరికాలో చదువుకుంటోంది. 

ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీలత ఇంట్లోకి ఓ దుండగుడు దొంగతానికి వచ్చాడు. ఇంటి ముందు చప్పుడు కావడంతో శబ్దాలకు ఆమె బయటకు వచ్చి చూసింది. ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు మహిళను చూసి రాడ్‌తో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రీలత ఎంతమాత్రం భయపడకుండా దొంగను ధైర్యంగా ప్రతిఘటించింది. చాకచక్యంగా వ్యవహరించి చీకట్లోనే అతనితో పోరాడింది. చివరికి గట్టిగా కేకలు వేయడంతో దొంగ చేతికి చిక్కిన ఏడు గ్రాముల బంగారు గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యాడు. 

మహిళా ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లి ధైర్యానికి సెల్యూట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కర్టెన్‌ ఉపయోగించి, దొంగ దాడి నుంచి తప్పించుకున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement