వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరుడి ఆలయానికి భక్తుల ద్వారా 25 రోజుల్లోనే కోటి రూపాయల ఆదయాం సమకూరింది. భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది శనివారం లెక్కించారు. రూ.99,06,842 నగదు, 218 గ్రాముల బంగారం, కేజీ వెండి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఓ అజ్ఞాత భక్తుడు రూ.5,62,570 రూపాయలను హుండీలో వేసినట్టు గుర్తించారు.