
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలోని రాజన్న దేవాలయం లడ్డూ విభాగం సూపరింటెండెంట్ నామాల రాజేందర్ ఇంట్లో గురువారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో రాజేందర్ ఇంట్లోనేగాక వేములవాడలోగల ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ గౌడ్ తో పాటు 40 మంది సిబ్బంది ఏకకాలంలో సోదాలు నిర‍్వహిస్తున్నారు. రాజేందర్ బంధువులైన వియ్యంకుడు కోళ్ల శ్రీనివాస్, బావ కపిల్ శ్రీనివాస్, సోదరుడు శ్రీనివాస్ ఇండ్లతో పాటు హైదరాబాద్ లోని వియ్యంకుడి ఇంటిలో కూడా దాడులు జరుగుతున్నాయి. డాక్టుమెంట్లు, బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు పూర్తి వివరాలు తెలియజేస్తామని సుదర‍్శన్‌గౌడ్ చెప్పారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ఆలయ ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. మిగతా బంధువులు అప్రమత్తం అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment