సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
– మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల..
వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్‌ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్‌ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు.
ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.
పర్యవేక్షణ కరువు...
ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్‌లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
– లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment