మేడిపెల్లి(వేములవాడ): దేశంలోని అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం శివుడు నిజరూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా పేరు పొందింది.
శివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి..
తొంబర్రావుపేట శివాలయంలో మహాశివరాత్రిని పురష్కరించుకొని నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నెల 10న పుణ్యహవచనం, స్థాపిత దేవతల పూజలు, అభిషేకాలు, 11న స్వామివారి కల్యాణం, జాగారం, లింగోధ్భావం, 12న రథోత్సవం, అన్నదానం, 13న బద్దిపోచమ్మకు బోనాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చదవండి: నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment