
దసరాలోగా అందరికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ పట్టణ ప్రగతిలో శనివారం ఆయన పాల్గొన్నారు.
సాక్షి, సిరిసిల్ల: దసరాలోగా అందరికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ పట్టణ ప్రగతిలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రైతుబజార్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 100 పడకల ఆస్పత్రిలో రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచిందని.. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి, ఆదర్శంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.