విద్యుత్ దీపాల వెలుగులో తళుకులీనుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం.
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యుడు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున జేఈవో బృందం, అనంతరం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
రూ.3.7 కోట్ల వ్యయంతో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు 3 లక్ష ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 వేల మందితో ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. జాతర ఉత్సవాల చైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. రాజన్న భక్తుల కోసం గుడి చెరువులోకి గోదా వరి జలాలను శుక్రవారం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment