
సాక్షి, సిరిసిల్ల : వేములవాడలో కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. మూలవాగుపై 2 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు సాయి కన్ర్స్టక‌్షన్స్ 28 కోట్లకు టెండర్లు దక్కిందచుకుంది. ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తై వినియోగంలోకి రాకముందే మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాగా, ముడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి రావావల్సిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. 190 మీటర్ల పొడవు గల బ్రిడ్జిలో ఇప్పటికి 150 మీటర్ల వరకు సెంట్రింగ్ పనిపూర్తయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో ఒక్క పిల్లర్ ఒరిగిపోగా, బ్రిడ్జిలోని 16 భీములకు పగుళ్లు ఏర్పాడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో పని చేయడంవల్లే బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment