
సాక్షి, వేములవాడ: ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆదరణ సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌లో కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరించింది. తన మార్క్ పల్లెటూరి డైలాగ్ లతో అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు ఓట్లు వేసేందుకు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడిచింది. అయితే బిగ్‌బాస్ హౌజ్ వాతావరణం పడకపోవడంతో ఆమె అనారోగ్యం పాలైంది. దాంతో హౌజ్‌నుంచి మధ్యలోనే బయటకు రాక తప్పలేదు.
ఇక బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున చలువతో సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా.. తన చిరకాల కోరికను తీర్చుకుంది. ఆమె హెలీకాప్టర్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అంతెత్తు ఆకాశం నుంచి తన ఊరు పొలాలను, ఇళ్లను చూసి ఆమె మురిసిపోయింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో హెలీకాప్టర్ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాజన్న దర్శనానికి వెళ్లిన గంగవ్వ గాలి మోటార్ ఎక్కి పరవశించిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment