ప్రమాదకరంగా మిషన్‌ భగీరథ గుంతలు  | Dangarous Mission Pits In Vemulawada | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా మిషన్‌ భగీరథ గుంతలు 

Published Mon, Nov 12 2018 10:10 AM | Last Updated on Mon, Nov 12 2018 10:10 AM

Dangarous Mission Pits In Vemulawada - Sakshi

పూడ్చకుండా వదిలిన మిషన్‌ గుంతలు

వేములవాడఅర్బన్‌: వేములవాడ అర్బన్‌ మండలంలోని గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసేందుకు పైప్‌ లైన్‌ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తిప్పాపూర్‌ గ్రామంలోని వేములవాడ కరీంనగర్‌ రహదారిలోని సౌరల కాలనీ వద్ద రోడ్డు పక్కన గుంతలు తీసి సరిగా పూడ్చకపోవడంతో రాత్రిపూట ప్రమాదకరంగా ఉందని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు. 

ఇటీవల వారం రోజుల క్రితం రహదారి వెంట వెళ్తున్న లోడ్‌తో ఉన్న లారీ రాత్రివేళ ఆ గుంతలో దిగబడి ఎటు వెళ్లకుండా అక్కడే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే క్రేన్‌ సహాయంతో బయటికి తీశారు. అధికారులు స్పందించి వెంటనే రహదారుల వెంట ఉన్న మిషన్‌ భగీరథ గుంతలను పూర్తిగా పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement