
వేములవాడ: పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్ జీకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ గేమ్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్న దుర్ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. యువతే కాదు..చిన్నారులు సైతం ఈ గేమ్ బారిన పడుతున్నారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పబ్జీ గేమ్ ఆడుతూ బాలుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలో బంధువులందరూ వివాహ సంబురాల్లో ఉండగా చరణ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు పబ్జీ గేమ్ ఆడుతూ కారులో ఉండిపోయాడు. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుని కోసం వెతికిన తల్లిదండ్రులు చివరకు బాలుణ్ని కారులో గుర్తించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన చరణ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పబ్జీగేమ్ ప్రాణాలు తీసిందని గుండెలవిసేలా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment