చీరతో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలం విఠల్‌నగర్‌లో చోటుచేసుకుంది.
కరీంనగర్ (గోదావరిఖని) : చీరతో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలం విఠల్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విఠల్‌నగర్‌కు చెందిన ముల్కల శ్యాంసుందర్(26) శనివారం ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.