
సాక్షి, కోల్ సిటీ (రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన దుర్గం మౌనికను ఆమె భర్త శ్రావణ్ హత్యచేశాడు. మౌనిక తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మౌనిక, శ్రావణ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భార్యను డిగ్రీ చదివించిన శ్రావణ్ ఇటీవల లాసెట్ పరీక్ష కూడా రాయించాడు. అయితే ఎలాంటి పనిచేయని శ్రావణ్ తండ్రి వారసత్వ ఉద్యోగం(సింగరేణి) కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భార్యపై శ్రావణ్ అనుమానం పెంచుకున్నాడు. మొబైల్‌లో మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని భార్యతో గొడవపడ్డ శ్రావణ్ ఆమెను హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment