శునకాన్ని కాపాడిన సింగరేణి ఉద్యోగులు
సాక్షి, గోదావరిఖని(పెద్దపల్లి): దారి తప్పి ఓసీపీ క్వారీ బ్లాస్టింగ్ ప్రాంతంలోకి శునకం పరుగెత్తుకొచ్చింది. బ్లాస్టింగ్ సిబ్బంది ఎక్స్‌ప్లో జివ్ నింపడంలో బిజీ అయ్యారు. అంతలోనే అటుగా వేగంగా వచ్చిన కుక్క 12 మీటర్ల లోతులో ఉన్న బ్లాస్టింగ్ హోల్‌లో పడిపోయింది. గమనించిన కార్మికులు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బ్లాస్టింగ్ ఇన్‌చార్జి డిప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్‌కు సమాచారం అందించారు.
బ్లాస్టింగ్ హోల్‌లోకి పంపే తాడు చివరన ఐరన్ గొలుసు కట్టి లోపల ఉన్న కుక్క పట్టుకునేందుకు గొలుసుమధ్యలో కర్ర కట్టారు. దీంతో 12మీటర్ల లోతున ఉన్న కుక్క దాన్ని పట్టుకోవడంతో చాకచక్యంగా తాడుతో బయటకు లాగారు. బయటకు వచ్చిన శునకం బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టింది. సింగరేణి ఉద్యోగులు, అధికారులను ఆర్జీ–2 జీఎం టీవీరావుతో పాటు పలువురు అభినందించారు.
చదవండి: ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రెండేళ్లు కలిసి తిరిగాక..
Comments
Please login to add a commentAdd a comment