![Singareni Worker Dead In Ramagundam Coal Mine Accident - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/4/Singareni-Worker-Dead.jpg.webp?itok=gg5MOx3_)
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి కార్మికుడు మృతిచెందాడు.
వివరాల ప్రకారం.. రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ-1 గనిలో పేలుడు సంభవించింది. గనిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు జయంత్ కుమార్ మృతి చెందినట్టు సమాచారం. దీంతో, మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment