మరో పవర్‌హౌస్‌ మూత | anothe power station closed | Sakshi
Sakshi News home page

మరో పవర్‌హౌస్‌ మూత

Jul 31 2016 4:51 PM | Updated on Sep 2 2018 4:23 PM

మరో పవర్‌హౌస్‌ మూత - Sakshi

మరో పవర్‌హౌస్‌ మూత

గోదావరిఖని (కరీంనగర్‌) : కంపెనీ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో నెలకొల్పిన 18 మెగావాట్ల పవర్‌హౌస్‌ మూతపడనుంది. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ వద్ద సింగరేణి ఆధ్వర్యంలోనే 1800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేయడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

  • గోదావరిఖని 18 మెగావాట్ల ప్లాంట్‌ 
  • మూసివేతకు సింగరేణి నిర్ణయం
  • ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
  • ఆందోళన బాటలో కార్మిక సంఘాలు 
  • గోదావరిఖని (కరీంనగర్‌) : కంపెనీ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో నెలకొల్పిన 18 మెగావాట్ల పవర్‌హౌస్‌ మూతపడనుంది. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ వద్ద సింగరేణి ఆధ్వర్యంలోనే 1800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేయడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పవర్‌హౌస్‌లో పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీ చేయడంలో భాగంగా స్థానికంగా ఉన్న డిపార్ట్‌మెంట్లకు వెళ్లడానికి దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో పవర్‌హౌస్‌ మూసివేయవద్దని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 1998లో బెల్లంపల్లి పవర్‌హౌస్, 2014లో కొత్తగూడెం పవర్‌హౌస్‌ మూసివేతకు గురికాగా ఆ జాబితాలో గోదావరిఖని పవర్‌హౌస్‌ చేరనున్నది.
    1968 నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం
    రామగుండం రీజియన్‌లో 1959 సంవత్సరం బొగ్గుగను లు చేపట్టగా 1961 నుంచి బొగ్గును వెలికితీత ప్రారంభమైంది. ఆ సమయంలో విద్యుత్‌కు ఇబ్బందిగా మారడం తో యాజమాన్యం గోదావరిఖనిలో 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌హౌస్‌ను రుమేనియా దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.7కోట్ల వ్యయంతో నిర్మించింది. 1968 నుంచి మూడు టరై్బన్లతో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైం ది. మొదట్లో 18 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినా.. క్రమేణా ఒక టరై్బన్‌తో 4 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికే పరిమితమైంది. ఈ పవర్‌హౌస్‌లో 248 మంది పనిచేయా ల్సి ఉండగా ప్రస్తుతం 111 మంది మాత్రమే ఉన్నారు. 
    రామగుండం, శ్రీరాంపూర్‌ ఏరియాలకు సరఫరా
    పవర్‌హౌస్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రామగుండం రీజియన్, శ్రీరాంపూర్‌ ఏరియా పరిధిలోని పలు బొగ్గుగను లు, ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నారు. పలు కాలనీలకు సైతం వినియోగిస్తున్నారు. 2013లో పవర్‌హౌస్‌లోని రెండవ టరై్బన్‌కు సంబంధించి రన్నర్‌ రీ–బ్లేడింగ్‌ చేయడానికి రూ.70లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పటివర కు ఆ టరై్బన్‌ను సదరు సంస్థ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం ఒకే టరై్బన్‌తోనే నాలుగు మెగావా ట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.
    బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం
    పవర్‌హౌస్‌ మూసివేతన నేపథ్యంలో అందులో పనిచేస్తు న్న ఉద్యోగుల్లో మొదటి విడతగా వివిధ డిజిగ్నేషన్లకు చెందిన 15 మందిని స్థానికంగా ఉన్న ఏరియా వర్క్‌షాపు, ఆటో వర్క్‌షాపులకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల ని యాజమాన్యం ప్రకటించింది. 
    అయితే పవర్‌హౌస్‌ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులను బదిలీ చేసే ఆలోచనను విరమించుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement