నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ వద్ద కల్వర్ట్‌ను శనివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.